విశాఖ పరేడ్‌లో ఆకట్టుకున్న బీటింగ్ సెర్మనీ

Updated on: Feb 20, 2026 | 7:59 PM

విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగిన 'ఆపరేషనల్ డెమో', 'ఇంటర్నేషనల్ సిటీ పరేడ్' భారత నావికాదళ శక్తిని ప్రపంచానికి చాటాయి. యుద్ధనౌకలు, విమానాల విన్యాసాలు, మెరైన్ కమాండోల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. 45 దేశాల బృందాలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లేజర్ షో, డ్రోన్ ప్రదర్శన, బాణసంచా వేడుకలు విశాఖ తీరాన్ని రంగులమయంగా మార్చాయి.

విశాఖ సాగర తీరం మరోసారి యుద్ధనౌకల గర్జనలు, విమానాల విన్యాసాలతో పులకించిపోయింది. భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే ‘ఆపరేషనల్ డెమో’, ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ ఆర్కే బీచ్ వేదికగా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ అద్భుత కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఈఎన్‌సీ చీఫ్ సంజయ్ భల్లా పర్యవేక్షించారు. కార్యక్రమంలో భాగంగా.. జాతీయ గీతాలాపన అనంతరం, జాతీయ జెండాను ఎగురవేస్తూ చేతక్ విమానాల ప్రదర్శనతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నేవీకి చెందిన చేతక్, ALH హెలికాప్టర్లు నిర్వహించిన ‘సెర్చ్ అండ్ రెస్క్యూ’ ఆపరేషన్లు చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. గగనతలంలో హాక్, మిగ్ యుద్ధ విమానాల ఫ్లై పాస్ట్, ఫైటర్ జెట్ల గర్జనలు అబ్బురపరిచాయి. మెరైన్ కమాండోల సాహసోపేత విన్యాసాలు నావికాదళ పరాక్రమాన్ని ప్రతిబింబించాయి. అనంతరం ఆర్కే బీచ్ రోడ్డులో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కవాతులో భారత్‌తో పాటు సుమారు 45 దేశాలకు చెందిన నావికాదళ బృందాలు పాల్గొన్నాయి. 9 దేశాల సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు, ఇండియన్ నేవీ బ్యాండ్ బృందాల బీటింగ్ సెర్మనీ ప్రేక్షకులను పరవశింపజేశాయి. ఈ సందర్భంగా దేశ భద్రతలో నావికాదళం పోషిస్తున్న కీలక పాత్రను గవర్నర్ మరియు నేవీ చీఫ్ కొనియాడారు. చివరగా ఆకాశంలో జరిగిన లేజర్ షో, డ్రోన్ ప్రదర్శన, బాణసంచా వేడుకలతో విశాఖ తీరం రంగులమయంగా మారింది. జనసందోహంతో కిక్కిరిసిన ఆర్కే బీచ్ తీరం నావికాదళ శౌర్యానికి సాక్ష్యంగా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు విడుదల..

దారుణం.. బిస్కెట్లు ఆశ చూపి చిన్నారిపై..

ముగిసిన ఆపరేషన్‌ టైగర్‌.. సురక్షితంగా అడవిలోకి బెబ్బులి

టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.. నోరు పారేసుకున్న రిపబ్లికన్‌ నేత

ఈ వీకెండ్‌లోనే.. ఇరాన్‌పై అమెరికా దాడులు !!

Loading...
Unable to load recommendations.
Follow Us