ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

Updated on: Nov 13, 2026 | 12:59 PM

హైదరాబాద్ ఫుడ్ అంటే ఎంతోమందికి ఇష్టం. చికెన్ బిర్యానీ, మటన్ మండీ, నోరూరించే స్నాక్స్... ఈ రుచులకు లొంగని వారు ఉండరు. ఆన్‌లైన్ యాప్‌లలో కనిపించే ఆకర్షణీయమైన చిత్రాలు, ఘుమఘుమలాడే సువాసనలకు ముగ్ధులై మనం తరచుగా ఆర్డర్ చేస్తుంటాం. అయితే, ఈ ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ వెనుక ఒక షాకింగ్ నిజం దాగి ఉందని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు (TG SAFE) తాజాగా బయటపెట్టారు.

హైదరాబాద్ ఫుడ్ అంటే ఎంతోమందికి ఇష్టం. చికెన్ బిర్యానీ, మటన్ మండీ, నోరూరించే స్నాక్స్… ఈ రుచులకు లొంగని వారు ఉండరు. ఆన్‌లైన్ యాప్‌లలో కనిపించే ఆకర్షణీయమైన చిత్రాలు, ఘుమఘుమలాడే సువాసనలకు ముగ్ధులై మనం తరచుగా ఆర్డర్ చేస్తుంటాం. అయితే, ఈ ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్ వెనుక ఒక షాకింగ్ నిజం దాగి ఉందని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు (TG SAFE) తాజాగా బయటపెట్టారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అనేక క్లౌడ్ కిచెన్‌లపై అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలుగుచూసిన దృశ్యాలు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు ఎంతో ఇష్టంగా తినే ఆహారం తయారవుతున్న ఈ ప్రదేశాలలో కనీస పరిశుభ్రత లోపించింది. ఎటు చూసినా ఎలుకల వ్యర్థాలు, బొద్దింకలు, ఫంగస్ పట్టిన కూరగాయలు, పురుగులు పట్టిన పిండి వంటివి కనిపించాయి. ముఖ్యంగా ఈ కిచెన్లలో కంపు కొట్టే వాతావరణం నెలకొందని అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా ఆహారం ఆర్డర్ చేస్తున్న ప్రజలు ఈ దారుణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌కి తప్పని వెయిటింగ్‌..

నవంబర్, డిసెంబర్ నెలల్లో బాక్సాఫీస్ పై చిన్న సినిమాల దండయాత్ర

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్ Vs రణవీర్ సింగ్..

రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us