భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ

Updated on: Feb 07, 2026 | 5:25 PM

హైదరాబాద్‌లో 5,113 మంది చిన్నారులు ఫిబ్రవరి 6న ప్రపంచ రికార్డు సృష్టించారు. అతిపెద్ద ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. గతంలో ఇటలీ పేరిట ఉన్న 962 మంది రికార్డును భారీ తేడాతో తుడిచిపెట్టేశారు. ఈ అద్భుత ఘనతతో హైదరాబాద్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగింది. చిన్నారుల ఉత్సాహం, ఐస్‌క్రీమ్ ఆనందం ఈ రికార్డుకు కారణం.

హైదరాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 6న ఒక అరుదైన ప్రపంచ రికార్డ్ నమోదైంది. ఐస్‌క్రీమ్ అంటే అమితంగా ఇష్టపడే 5,113 మంది చిన్నారులు ఒకే చోట చేరి, ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఐస్‌క్రీమ్ సోషల్ పార్టీ’ నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకున్నారు. గతంలో ఈ రికార్డు ఇటలీ పేరిట ఉండేది. 2019లో ఇటలీలోని సలెర్నోలో 962 మందితో నిర్వహించిన ఐస్‌క్రీమ్ పార్టీయే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. తాజాగా హైదరాబాద్‌లోని ఈ కార్యక్రమంలో ఐదు వేల మందికి పైగా చిన్నారులు పాల్గొని, పాత రికార్డును భారీ తేడాతో తుడిచిపెట్టేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల సమక్షంలో ఈ ఫీట్‌ను అధికారికంగా ధృవీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు ఈ రికార్డ్ సృష్టించేందుకు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిరంతరాయంగా 30 నిమిషాల పాటు వివిధ రకాల ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్‌లను ఆస్వాదిస్తూ పిల్లలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకేసారి ఇంతమంది స్నేహితులతో కలిసి ఐస్‌క్రీమ్ తింటూ ప్రపంచ రికార్డులో భాగస్వామ్యం కావడం మర్చిపోలేని అనుభూతి అని పాల్గొన్న చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. కేవలం వినోదం కోసమే కాకుండా, సామూహికంగా ఒక లక్ష్యం కోసం విద్యార్థులు ఏకమవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ పేరును మరోసారి మారుమోగేలా చేసిన ఈ చిన్నారుల ఘనతను అందరూ అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమ్మక్క తమ్ముడి జాతర.. అంకన్నగూడెంలో పూనకాలు

హైప్ పెంచుతున్న కొత్త ప్రపంచాలు.. హిట్ కోసం ఏ మాత్రం తగ్గని దర్శకులు

నమ్మించి నట్టేట్లో ముంచేస్తున్న హీరోయిన్స్.. ఎందుకు చేస్తున్నారు ఇలా

హద్దు దాటుతున్న ప్రమోషన్స్‌… చిక్కుల్లో పడుతున్న సినిమాలు

Prabhas: గ్లోబల్‌ రేంజ్‌లో డార్లింగ్ క్రేజ్‌.. జపాన్ మ్యాగజైన్ కవర్‌పై ప్రభాస్