హైవేపై కారులో మంటలు..తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్న కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చి.. క్షణాల్లో మంటలు చెలరేగాయి.ఖమ్మం నగరంలోని వెంకటాయపాలెం సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో హైవే పై కొత్తగూడెం వైపు వెళ్తున్న EV కారులో మంటలు చెలరేగాయి. కారు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అప్రమత్తం అయ్యి బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబంది కి సమాచారం ఇచ్చారు.
ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్న కారులో అకస్మాత్తుగా పొగలు వచ్చి.. క్షణాల్లో మంటలు చెలరేగాయి.ఖమ్మం నగరంలోని వెంకటాయపాలెం సమీపంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో హైవే పై కొత్తగూడెం వైపు వెళ్తున్న EV కారులో మంటలు చెలరేగాయి. కారు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అప్రమత్తం అయ్యి బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబంది కి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. దీంతో హైవే పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. ఇటీవల EV కారులో మంటలు చెలరేగడంతో సూర్యాపేట వద్ద ఖమ్మం వైద్యులు జగదీష్ సజీవ దహనమయ్యారు. ఇప్పుడు తగలబడిన కారులో ప్రయాణికులు అప్రమత్తమవ్వకపోతే అదే సీన్ రిపీట్ అయ్యేదని ఆందోళన చెందుతున్నారు