ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

Updated on: Aug 24, 2026 | 5:53 PM

ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగాన్ని వదిలి పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న మధ్యప్రదేశ్‌ మాజీ కట్నీ ఎస్పీ నేహా పచ్చీసియా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. హత్య కేసులో నిందితుడి కుటుంబం నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భూమి లావాదేవీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై విచారణ జరగగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

ఎయిర్‌హోస్టెస్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, కష్టపడి పోలీసు కొలువు సాధించి ఎన్నో ప్రశంసలు అందుకున్న ఓ మహిళా ఆఫీసర్.. చివరకు అవినీతి ఊబిలో చిక్కుకుని కటకటాలపాలైంది. మధ్యప్రదేశ్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన 37 ఏళ్ల పోలీసు అధికారి నేహా పచ్చీసియా కథ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ నిమిత్తం ప్రభుత్వం శనివారం ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగర ఎస్పీగా పనిచేసిన నేహా పచ్చీసియా.. గతంలో ఖండ్వా, గుణ తదితర జిల్లాల్లోనూ బాధ్యతలు నిర్వర్తించారు. గుణలో ఎస్పీగా సేవలందిస్తున్న సమయంలో మహిళా మొబైల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి, ఇళ్ల దగ్గరికే పోలీసు సేవలు అందేలా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఆ తర్వాత కట్నీకి బదిలీపై వెళ్లిన ఆమె అవినీతి మార్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఓ హత్య కేసులో నిందితుడైన రమేశ్‌ లోధి కుటుంబం నుంచి ఆమె భారీగా లంచం డిమాండ్ చేశారు. కేసు నుంచి విముక్తి కల్పిస్తామంటూ నిందితుడి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఏకంగా రూ.15 లక్షలు వసూలు చేయాలని చూశారు. ఇందుకోసం బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.2 కోట్ల విలువ చేసే 2.15 హెక్టార్ల భూమిని, కేవలం రూ.18 లక్షలకే మరూఫ్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించేలా బలవంతం చేశారు. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టగా, ఆమె చేసిన అవినీతి బాగోతం బట్టబయలైంది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తీవ్రంగా స్పందించి తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

Cheque Book New Rules: చెక్ బుక్‌లపై కొత్త రూల్స్.. మీ పాత చెక్ ఇక చెల్లదా?

దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

Loading...
Unable to load recommendations.
Follow Us