పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??
పాటల హక్కులు, రాయల్టీల పంపిణీపై ఇటీవల తలెత్తిన వివాదాలు ఈ ఆర్టికల్‌లో విశ్లేషించబడ్డాయి. ఇళయరాజా, SPB మధ్య జరిగిన సంఘర్షణను వివరిస్తూ, IPRS, PPL, NovEx సంస్థల పాత్రలు, వాటి నిబంధనలు చర్చించబడ్డాయి. రచయితలు, స్వరకర్తలు, నిర్మాతల మధ్య రాయల్టీ ఎలా పంపిణీ అవుతుంది, సింగర్లకు హక్కులు ఎందుకు లభించడం లేదనే అంశాలపై లోతైన సమాచారం అందిస్తుంది.
పాటల విషయంలో జరుగుతున్న వివాదాలు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పాటల విషయంలో కాంట్రవర్శీ అంటే ట్యూన్‌ని కాపీ కొట్టేశారనో, తమ లిరిక్స్ ని ఉన్నవున్నట్టు వాడేశారనో… పదాల్లో ద్వంద్వార్థాలున్నాయనో… ఇలాంటివే ఉండేవి. కానీ, ఇళయరాజా సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా వినిపించసాగింది. తాను కంపోజ్ చేసిన పాటలను కాన్సర్టుల్లో పాడేటప్పుడు తన అనుమతి తీసుకోవాలంటూ ఇళయరాజా కొత్తగా వివాదాన్ని స్టార్ట్ చేశారు. ఆ పాట పాడిన సింగర్స్ కి రైట్స్ ఉండవా? అంటూ బాలసుబ్రహ్మణ్యం గళం వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక పాట మీద ఎవరికి ఏ రైట్స్ ఉంటాయి? ఎంత మేర హక్కులుంటాయి? IPRS ఏమంటోంది? PPL ఏమంటోంది? నోవెక్స్ ఏం చెబుతోంది? ఇండియన్ సింగర్స్ అసోసియేషన్ పరిస్థితి ఇప్పుడు ఏంటి? అనేవి ఇప్పుడు చూద్దాం.! IPRS- ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్! ఇది కాపీరైట్ సొసైటీ. ఇందులో రచయితలు, కంపోజర్స్, పబ్లిషర్స్ ఉంటారు. లీగల్ గా ప్లే అయిన మ్యూజిక్ నుంచి IPRSకి రాయల్టీ రూపంలోడబ్బులు అందుతాయి. వీళ్లు ఆ మొత్తాన్ని కంపోజర్‌కి 25 శాతం, రచయితలకు 25శాతం, మ్యూజిక్ ప్రొడ్యూసర్ కి 50 శాతంగా కేటాయిస్తారు. మ్యూజిక్ ప్రొడ్యూసర్ కేటగిరీలో ఒరిజినల్ సినిమా ప్రొడ్యూసర్, ఒరిజినల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉండవచ్చు. లేకుంటే వాళ్లు మ్యూజిక్ లేబుల్‌కి తన షేర్‌ని విక్రయించి ఉండవచ్చు. ఒకవేళ విక్రయించిన పక్షంలో సదరు మ్యూజిక్ లేబుల్ ఆ 50 శాతాన్ని తమ ఖాతాలో వేసుకుంటుంది. PPL – ఫొనోగ్రాఫిక్ పెర్పార్మెన్స్ లిమిటెడ్. ! ఇది 1941లో మొదలైంది.సంగీత ప్రపంచంలో PPL అంటే తెలియనివారు అరుదు. సౌండ్ రికార్డింగ్స్ కి సంబంధించి ఈ సంస్థ బాధ్యతలు తీసుకుంటుంది. దాదాపు 450కి పైగా మ్యూజిక్ లేబుల్స్ ఇందులో ఉంటాయి. దాదాపు 70 లక్షలకు పైగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ సౌండ్ రికార్డింగ్స్ వీరి ఆధ్వర్యంలో ఉంటాయి. రెస్టారెంట్స్, బార్స్, ఈవెంట్స్ లో ప్లే చేసే మ్యూజిక్ మీద ఈ సంస్థ రాయల్టీ వసూలు చేస్తుంది. సంబంధిత కళాకారులకు పంపిణీ చేస్తుంది. ఆర్టిస్టులకు సపోర్ట్ చేయండి… వర్రీ ఫ్రీగా మ్యూజిక్ ప్లే చేయండి అనే నినాదంతో పని చేస్తుంది. నావెక్స్ – పబ్లిక్ పెర్ఫార్మెన్స్ లో సౌండ్ రికార్డింగ్స్ ని ఇండియాలో మేనేజ్ చేస్తుంది నావెక్స్ కమ్యూనికేషన్స్. కమర్షియల్ ఈవెంట్స్, వెడ్డింగ్స్, కార్పొరేట్ షోస్, హోటల్స్, మాల్స్ వంటివాటిల్లో ప్లే అయ్యే మ్యూజిక్ కి రాయల్టీ కలెక్ట్ చేస్తుందీ సంస్థ. ఇందులో ఉన్న లేబుల్స్ కి వీళ్లు రాయల్టీ ని పంపిణీ చేస్తారు. ఇప్పుడంటే అందరూ PPL వైపు మొగ్గుచూపుతున్నారు గానీ.. ఒకప్పుడు నావెక్స్ ఈ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేదన్నది సీనియర్స్ మాట. IPRS లో సింగర్స్ కి ఎలాంటి ప్రాధాన్యం లేదు. 1957 కాపీ రైట్స్ యాక్ట్ కి 2012లో చేసిన అమెండ్‌మెంట్ ప్రకారం IPRSలో సింగర్స్ కి రాయల్టీ రాదు. వాళ్లు కంటెంట్ క్రియేటర్స్ కాదని, అందుకే రాయల్టీ ఇవ్వట్లేదంటుంది IPRS. మరి అలాంటప్పుడు తమ కష్టాన్ని ఎవరు గుర్తించాలంటూ ఆలోచించి 2013లో ఏర్పడ్డదే ఇండియన్ సింగర్స్ అండ్ మ్యుజీషియన్స్ రైట్స్ అసోసియేషన్. ఈ సంస్థ కోసం మరీ ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేసిన కృషి మరువలేనిది అని అంటుంటారు గాయనీగాయకులు. స్టేజ్‌ల మీద గాయనీగాయకులు పాడినప్పుడు, ప్రదర్శనలు ఇచ్చినప్పుడు రాయల్టీ వసూలు వేసి, సంబంధిత కళాకారులకు పంపిణీ చేసే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటైంది. బాలసుబ్రహ్మణ్యం తదనంతరం ఈ సంస్థ కూడా PPLలో భాగమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలు పరార్!
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
ఏరియా 51లోనే ఏలియన్స్ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!
