Ustaad Bhagat Singh: తెలంగాణలో పవన్‌ సినిమాకు.. టికెట్ రేట్స్‌ పరేషాన్

Updated on: Feb 12, 2026 | 9:44 AM

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది చిత్రాలకు టికెట్ రేట్ల పెంపు తెలంగాణలో పెద్ద సవాల్‌గా మారింది. 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్న హైకోర్టు ఆదేశంతో మేకర్స్ ఇప్పటికే ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు, పెద్ది టైటిల్ సాంగ్ ఫిబ్రవరి నెలాఖరున, ఉస్తాద్ రెండో పాట మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న విడుదల కానున్నాయి. మెగా అభిమానులకు ఇది డబుల్ ధమాకా.

పవన్‌ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది సినిమాల రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. మేకర్స్‌లో ఇప్పటికే టికెట్ రేట్స్ పరేషన్ మొదలైంది. ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో ఈ మూవీ మేకర్స్‌కు పెద్ద ఇబ్బంది లేనప్పటికీ.. తెలంగాణలోనే టికెట్ల పెంపు పెద్ద సవాల్‌గా మారింది. అందులోనూ 90 రోజుల ముందే టికెట్ల రేట్ల పెంపు కోసం మేకర్స్ అప్లై చేసుకోవాలని తెలంగాణ హైకోర్ట్ ఆర్డర్‌ ఉంది. దీంతో ఉస్తాద్ అండ్ పెద్ది మేకర్స్, ఇప్పటికే టికెట్‌ రేట్ల పెంపు కోసం, తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్‌ కోసం ఒకటి కాదు.. రెండు లడ్డూల్లాంటి అప్డేట్స్ బయటికి వచ్చాయి. బుచ్చిబాబు డైరెక్షన్లో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా పెద్ది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన చికిరి సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే మూవీ నుంచి రెండో సాంగ్‌గా.. టైటిల్ సాంగ్ .. ఫిబ్రవరి లాస్ట్ వీక్‌లో మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మూవీ టీం కూడా.. మహాశివరాత్రి సందర్భంగా.. ఫిబ్రవరి 15న సెకండ్‌ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇన్‌సైడ్ టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karimnagar Municipal Election: దొంగ ఓట్లు వేస్తున్నా పట్టించుకోవట్లేదు

రేపటి నుంచి అసెంబ్లీలో AI ఆధారిత అటెండెన్స్

మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం

ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో.. అగ్నిప్రమాదం

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ

Loading...
Unable to load recommendations.
Follow Us