TOP 9 ET: 6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు? | జానీని పట్టించింది ఎవరో కాదు.. ఆయన భార్యే.!

|

Sep 20, 2024 | 9:24 AM

జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ మాత్రమే కార్నర్ అవుతున్నారనే కామెంట్ ఎక్కువ అవుతోంది. దాదాపు 6 సంవత్సరాలుగా జానీ మాస్టర్తో ట్రావెల్ చేస్తున్న అమ్మాయి.. ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి వచ్చి, జానీ మాస్టర్ పై ఆరోపణలు చేయడంలో.. ఏదైనా కుట్ర కోణం ఉందనే డౌట్ జానీ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో కలుగుతోంది.

01.Dace Master: 6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు.?

ఇది కుట్రా..? అసలు నిజమేంటి?

జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ మాత్రమే కార్నర్ అవుతున్నారనే కామెంట్ ఎక్కువ అవుతోంది. దాదాపు 6 సంవత్సరాలుగా జానీ మాస్టర్తో ట్రావెల్ చేస్తున్న అమ్మాయి.. ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి వచ్చి, జానీ మాస్టర్ పై ఆరోపణలు చేయడంలో.. ఏదైనా కుట్ర కోణం ఉందనే డౌట్ జానీ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌లో కలుగుతోంది. దీనికి తోడు.. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ కూడా.. ఇదే పాయింట్‌ను ఓ ఇంటర్వ్యూలో లేవనెత్తడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

02.Johany: పోలీసుల పక్కా స్కెచ్‌.. దెబ్బకు దొరికిన జానీ.

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోక్సో కింద కూడా కేస్ బుక్ చేశారు. ఇక ఈ కేసులు బుక్కైంది మొదలు.. జానీ మాస్టర్ పోలీసులకు చిక్కుండా.. దొరకుండా తిరుగుతున్నారు. దీంతో ప్రత్యేక బృందాలుగా డివైడ్‌ అయిన పోలీసులు జానీ మాస్టర్ కోసం.. తీవ్రంగా సెర్చ్‌ చేశారు. పక్కా స్కెచ్ వేశారు. ఈక్రమంలోనే ఈస్టార్ కొరియోగ్రాఫర్ ఎట్టకేలకు గోవాలో చిక్కాడు. చివరికి అరెస్ట్ అయ్యాడు.

03.Johany: జానీని పట్టించింది ఎవరో కాదు.. ఆయన భార్యే.!

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ఎట్టకేలకు గోవాలో పోలీసులకు చిక్కాడు. అయితే జానీ మాస్టర్‌ భార్య సుమతి అలియాస్ అయేషా ఇచ్చిన సమాచారంతోనే.. జానీ మాస్టర్‌ పోలీసులకు దొరికాడనే న్యూస్ బయటికి రావడం.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. భర్తను పట్టించిన భార్య అనే కామెంట్ నెటిజెన్స్‌ నుంచి వస్తోంది.

04.Johany: పోలీస్‌ స్టేషన్లో.. జానీ భార్య దురుసు ప్రవర్తన.

జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు సంచలంగా మారింది. స్టార్ కొరియోగ్రాఫర్‌గా మంచి హోదాలో ఉన్న జానీ మాస్టర్.. తన అస్టింట్‌ను లైంగికంగా వేధించడంపై దాదాపు అన్ని ఇండస్ట్రీల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా.. పోలీస్‌ స్టేషన్లో దురుసుగా ప్రవర్తించిన వీడియో ఒకటి బయటికి రావడం మరింత సంచలనంగా మారింది. ఇక ఇదే లేడీ కొరియాగ్రాఫర్ పై దాడి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ భార్య.. ఉన్నట్టుండి నార్సింగ్ పోలీస్‌ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. వచ్చీ రాగానే. అక్కడున్నమీడియాపై దురుసుగా ప్రవర్తించారు. అందరిపై కేసులు పెడతానంటూ చిందులు తొక్కారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

05.Cooli: కూలీ సినిమాలో యాక్షన్ సీన్ లీక్‌ దెబ్బకు ఉసూరుమన్న స్టార్ డైరెక్టర్.!

కూలీ సినిమా నుంచి కింగ్ నాగార్జున బ్రూట్‌ లెస్ యాక్షన్ సీన్ ఒకటి లీక్‌ అయింది. షూట్ లొకేషన్లో ఉన్న ఓ వ్యక్తి.. నాగ్ యాక్షన్ ను రికార్డ్‌ చేసి.. లీక్‌ చేయడం సంచలనంగా మారింది. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఇక లీక్‌పై తాజాగా ఈమూవీ డైరెక్టర్ లోకేశ్ ఎమోషనల్‌గా రియాక్టయ్యారు. తమ 2 నెలల కష్టం వృథా అయింది అంటూ.. ఊసురుమన్నారు. ఇలాంటివి నాట్ ఎంకరేజబుల్ అంటూ.. హెచ్చరించారు. అయితే కూలీ సీన్‌ లీక్ పక్కకు పెడితే.. ఈ స్టార్ డైరెక్టర్ రియాక్షన్ ఇప్పుడు అందర్నీ బాధపడేలా చేస్తోంది.

06.NTR – Atlee: ఆ విషయంలో బన్నీని ఫాలో అవుతున్న NTR.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఒక్క విషయంలో బన్నీని ఫాలో అవుతున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌ను గుర్తించి వారితో సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే అట్లీతో ఓ సినిమా తప్పకుండా చేస్తానంటూ.. రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పారు తారక్. ఇప్పటికే అట్లీ తనకో రొమాంటిక్ కామెడీ కథ చెప్పాడని.. త్వరలో సినిమా చేస్తామంటూ హింట్ ఇచ్చారు.

07.Johany: ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.?

జానీమాస్టర్‌పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. జానీ మాస్టర్‌కు వత్తాసు పలికేలా ఆయన భార్య అయేషా తనపై దాడి చేసి పలుమార్లు కొట్టారంటూ.. పోలీసుల ముందు తన బాధను వెళ్లగక్కారు. అంతేకాదు ఓ డాన్స్‌ షోలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు బాధితురాలు. ఆ షోలో పార్టిసిపేట్‌ చేయడంతో.. ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్‌ చేసి తన గ్రూపులో చేర్చుకుంటానన్నారని చెప్పారు. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్‌లో ఉన్నప్పుడు జానీ మాస్టర్‌ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్‌ చేశారు. ప్రతిఘటిస్తే కొట్టి, హింసించే వారని.. మతం మార్చుకుని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు.

08.Mokshagna teja: మైథలాజికల్ కాన్సెప్ట్స్ తో వస్తున్న వారసులు..

దేవుడి కాన్సెప్ట్ సినిమాలకు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఇండస్ట్రీకి స్టార్ హీరోల వారసులను పరిచయం చేయడం కోసం కూడా ఇలాంటి కథల్నే ఎంచుకుంటున్నారు దర్శకులు. తాజాగా మరో వారసుడు సైతం ఇలాంటి ఓ దేవుడి కథతోనే వస్తున్నాడు. ఈ మధ్యే మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మపై పెట్టారు బాలయ్య. ఈయన తొలి సినిమా మైథలాజికల్ టచ్‌తోనే సాగనుంది. తన యూనివర్స్‌లో భాగంగా ఈ కథ రాస్తున్నారు ప్రశాంత్ వర్మ. అచ్చం ఇలాగే సాయికుమార్ తమ్ముడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ కూడా తన వారసుడిని దేవుడి నేపథ్యం ఉన్న కథతోనే లాంఛ్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నారు. రీసెంట్‌ గా రిలీజ్ అయిన ట్రైలర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

09.Rajini: ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. రజినికాంతా.. మజాకా.!

కొందరు హీరోల సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లుంటేనే చాలు ప్రమోషన్ వచ్చేస్తుంది. అలాంటి హీరోనే రజినీకాంత్ కూడా. సూపర్ స్టార్ బొమ్మ కనిపిస్తే చాలు కలెక్షన్లు అవే వచ్చేస్తుంటాయి.. ఇక బాగుంటే రికార్డులే. ప్రస్తుతం ఈయన వేట్టయన్ సినిమాతో అక్టోబర్ 10న రానున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 20న జరగనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడినా కూడా స్పెషల్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు మేకర్స్. కానీ తాజాగా రజినీ ఈ బాధ్యత తీసుకున్నారు. కూలీ సెట్స్‌లో.. వేట్టయన్ సాంగ్‌కు డాన్స్ వేసారు.. దాంతో దెబ్బకు సినిమా ట్రెండ్ అవుతుందిప్పుడు. లోకేష్ కనకరాజ్ సినిమా లొకేషన్స్‌లో మనసిలాయో అంటూ మాస్ స్టెప్పులు వేసారు రజినీ. అంతే.. ఇటు కూలీతో పాటు.. అటు వేట్టయన్ గురించి మాట్లాడేసుకుంటున్నారు నెటిజన్లు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటే ఇదే కాబోలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 20, 2024 09:24 AM