టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే..

Updated on: Aug 12, 2026 | 12:14 PM

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. అధ్యక్షురాలు సుమలత వర్గం, ఫెడరేషన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో చాలామంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఖాళీగా ఉన్న జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్ల భాగస్వామ్యం తక్కువగా ఉండటంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్ మందకొడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు చాలా తక్కువ మంది సభ్యులు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వర్గం, ఫెడరేషన్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా ఒక వర్గం ఎన్నికలను బహిష్కరించింది.2025 డిసెంబర్‌లో సుమలత అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత అసోసియేషన్ వ్యవహారాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జూలైలో జరిగిన జనరల్ బాడీ సమావేశం సందర్భంగా పరిపాలన, ఎన్నికల ప్రక్రియ, ఆర్థిక వ్యవహారాలపై ఆరోపణలు రావడంతో 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన జనరల్ సెక్రటరీ, ట్రెజరర్, ఎనిమిది ఈసీ మెంబర్స్ పదవులకు ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.ఫెడరేషన్ జోక్యం అవసరం లేదని సుమలత వర్గం చెబుతుండగా, ఫెడరేషన్ మాత్రం అనుబంధ యూనియన్లకు తన నిర్ణయాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us