TOP 9 ET: నో డౌట్.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి
అల్లు అర్జున్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా ఉంటుందని కన్ఫార్మ్ చేశారు ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నామని తెలిపారు. స్పిరిట్ తర్వాత యానిమల్ సీక్వెల్ ఉంటుందని.. ఆ తర్వాతే సందీప్ డైరెక్షన్లో అల్లు అర్జున్‌తో మూవీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్ సినిమా తీసుకుందుకు రెడీ అంటున్నాడు. పుష్ప3 అంటూ సుక్కు, స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎలాగూ లైన్లో నే ఉన్నాడు. వీళ్లే కాకుండా..బాలీవుడ్‌లో కూడా ఓ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు కూడా బన్నీ డేట్స్ కోసం తెగ కష్టపడుతున్నారని న్యూస్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah: రౌడీ జనార్ధనతో మిల్కీబ్యూటీ స్టెప్పులేస్తున్నారా ??
బాలీవుడ్‌ని షేక్ చేస్తున్న దేశభక్తి చిత్రాల వసూళ్లు
బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తున్న దేశభక్తి చిత్రాలు
