The Taj Story OTT: తాజ్ మహల్ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..
వివాదాస్పద చిత్రం 'ది తాజ్ స్టోరీ' మార్చి 13న లయన్స్‌గేట్ ప్లేలో OTTలోకి వస్తుంది. తాజ్‌మహల్ నిర్మాణ చరిత్రపై ప్రశ్నించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించింది. షాజహాన్, శివాలయ సిద్ధాంతాలపై ఆధారపడిన ఈ కథ తెలుగు, తమిళ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది. మిస్ అవ్వకండి! 'ది తాజ్ స్టోరీ'! గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎన్నో వివాదాలకు దారి తీసింది.
‘ది తాజ్ స్టోరీ’! గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఎన్నో వివాదాలకు దారి తీసింది. అందులోనూ.. తాజ్ మహల్ నుంచి శివుని విగ్రహం బయటకు వస్తున్నట్టుగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం డిజైన్ చేసిన పోస్టర్ అప్పట్లో సంచలనంగా మారింది. ఈ మూవీని థియేటర్లలోకి రాకుండా బ్యాన్ చేయాలనే డిమాండ్ ఓ వర్గం నుంచి ఉవ్వేత్తున వచ్చింది. అయితే వివాదాల మధ్యలోనే అక్టోబర్ 31,2025లో రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర మరో వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. ఇప్పుడీ సినిమా సుమారు 4 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ది తాజ్ స్టోరీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్ గేట్ ప్లే .. ఈ మూవీని మార్చ్ 13 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసింది. ఒరిజినల్ హిందీ పాటు.. తెలుగు,తమిళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకున్నట్టు తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. ది తాజ్ స్టోరీ ఏంటంటే? తాజ్ మహల్ నిజంగా షాజహానే నిర్మించాడా? లేదా దీని వెనుక ఏదైనా తెలియని మిస్టరీ ఉందా? అనేదే ప్రధానాంశంగా ది తాజ్ స్టోరీ మూవీని తెరకెక్కించారు. తాజ్ మహల్ ఓ పురాతన శివాలయం అని, దీన్ని షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చరిత్రకారుడు పీఎన్ ఓక్ వివాదాస్పద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 4వ శతాబ్దంలో రాజా పరమార్థి దేవ్ దీనిని నిర్మించారని… 17వ శతాబ్ధంలో షాజహాన్ దీన్ని మార్చారంటూ కొందరు నమ్ముతారు. అయితే పురాతత్వ శాఖ దీన్ని నిరాకరించింది. ఈ క్రమంలోనే తాజ్ మహల్ ఒక హిందూ దేవాలయం అని నిరూపించేందుకు విష్ణు దాస్ అనే టూర్ గైడ్ చేసిన పోరాటమే ది తాజ్ స్టోరీ. తుషార్ అమ్రిష్ గోయెల్ ఈ సినిమాను తెరకెక్కించగా… పరేశ్ రావల్ లీడ్ రోల్ చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Thanuja: ఫ్యాన్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ
Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్
