సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు
రొటీన్ కథలకు గుడ్‌బై చెప్పి, తెలుగు హీరోలు సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. శర్వానంద్, అడివి శేష్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ వంటి తారలు తమ ఇమేజ్‌ను పక్కనపెట్టి, విభిన్న కథాంశాలు, జానర్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. సేఫ్ జోన్ వదిలి రిస్క్ తీసుకుంటున్న ఈ హీరోలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటాలని ఆశిస్తున్నారు.
రొటీన్ కథలతో సేఫ్ గేమ్ ఆడితే ఆడియన్స్ బాక్సాఫీస్ దగ్గర ఆడుకోవడం ఖాయమని మన హీరోలకు అర్థమైపోయింది.. అందుకే రూట్ మారుస్తున్నారు. ఇమేజ్ చట్రాన్ని బద్దలు కొట్టి.. కంఫర్ట్ జోన్ దాటి సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతున్నారు. హిట్టు కోసం ఏకంగా తమ బ్రాండ్‌నే పక్కనపెట్టి రిస్క్ తీసుకుంటున్న ఆ హీరోలెవరో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దాం.. లవర్ బాయ్ ఇమేజ్‌లో ఉండే శర్వానంద్ బైకర్ అనే స్పోర్ట్స్ డ్రామాతో వస్తున్నారు.. ఇండియాలోనే ఫస్ట్ మోటోరేస్ సినిమా ఇది. ఇక సంపత్ నందితో చేస్తున్న భోగి పీరియాడ్ మాస్ సబ్జెక్ట్. ఈ రెండింట్లోనూ శర్వా సేఫ్ జోన్‌ను పక్కనబెట్టారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన అడివి శేష్.. డెకాయిట్ కోసం ట్రాక్ మార్చి మృణాల్ ఠాకూర్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా రామ్ పోతినేనికి క్లాస్, మాస్ ఏదీ వర్కవుట్ కాలేదు.. ఫైనల్‌గా ఆ సేఫ్ జోన్ వదిలేసి పక్కా థ్రిల్లర్ సినిమా వైపు అడుగులేస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు వరసగా ఫిక్షన్ స్టోరీలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్న తేజ సజ్జా.. ఈసారి తన మార్క్‌కు బ్రేక్ ఇచ్చి కమర్షియల్ ఫార్మాట్ కథ కోసం ఓ తమిళ్ డైరెక్టర్‌తో సీరియస్‌గా మాటా మంతి జరుపుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తన కమర్షియల్ రూట్ పక్కనబెట్టి.. సంబరాల ఏటిగట్టు కోసం రా అండ్ రస్టిక్‌గా మారిపోయారు. మాస్ జాతర తర్వాత రవితేజలో మార్పు గట్టిగానే కనిపిస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సేఫ్ జోన్ నుంచి బయటికొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌ను పలకరించారు.. తాజాగా ఇరుముడి అనే వెరైటీ కాన్సెప్ట్‌తో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా అంతే.. తన ఇమేజ్‌కు భిన్నంగా రణబాలి, రౌడీ జనార్ధన లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తూ కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. మొత్తానికి హీరోలు సేఫ్ గేమ్ ఆడటం మానేస్తేనే.. ఆడియన్స్ వాళ్లతో ఆడుకోవడం ఆపుతారన్న లాజిక్ పట్టుకుని.. ఈ మేకోవర్స్‌తో బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి ఈ ప్రయోగాలు వర్కవుట్ అవుతాయో లేదో చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: