సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

Updated on: Nov 13, 2026 | 5:55 PM

సీన్ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన నటుడు సూర్య, తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో వేగం పెంచారు. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో పడగోట్టి అనే కోస్టల్ యాక్షన్ డ్రామాలో నటిస్తుండగా, టీ.జే. జ్ఞానవేల్‌తో సూర్య 48 కూడా సిద్ధమవుతోంది. వరుస విజయాలతో ఆయన సక్సెస్ గ్రాఫ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నారు.

కోలీవుడ్ స్టార్ సూర్య సీన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందుకున్నారు. వరుస విజయాలతో పూర్తి ఉత్సాహంలో ఉన్న సూర్య, తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో వేగం పెంచారు. ఇటీవల సూర్య 49వ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ టైటిల్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. జిత్తు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన సీన్ సినిమాలో ఇనబ్రాజ్ పాండియన్ పాత్రలో సూర్య అదరగొట్టారు. ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండగానే, సూర్య 49కి సంబంధించి ఒక అప్‌డేట్ వెలువడింది.మండాడి సినిమాతో ఆకట్టుకున్న యువ దర్శకుడు మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూర్య తన 49వ సినిమా చేయబోతున్నారు. ఇది సముద్ర తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితాలు, వారి కష్టసుఖాలు, పోరాటాల నేపథ్యంలో సాగే ఓ భారీ కోస్టల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ కథ కోసం దివంగత లెజెండరీ నటుడు ఎం.జి.ఆర్. నటించిన పడగోట్టి అనే క్లాసికల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌కి తప్పని వెయిటింగ్‌..

నవంబర్, డిసెంబర్ నెలల్లో బాక్సాఫీస్ పై చిన్న సినిమాల దండయాత్ర

బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రణబీర్ కపూర్ Vs రణవీర్ సింగ్..

రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us