రామాయణ తరువాత రాజమౌళి మనసు మార్చుకున్నారా?

Updated on: Nov 13, 2026 | 12:00 PM

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబుతో వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామాయణం 2 మరియు వారణాసి చిత్రాలు మహాభారతానికి పునాది వేస్తున్నాయని, నమిత్ మల్హోత్రాతో కలిసి రాజమౌళి ఈ భారీ ఇతిహాసాన్ని తెరకెక్కిస్తారని టాక్.

SS రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ట్రిపుల్ ఆర్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఉంటుందా అనే చర్చ నడుస్తోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన రాజమౌళికి మహాభారతాన్ని వెండితెరపై ఆవిష్కరించడం చిరకాల కోరిక. ఈ నేపథ్యంలో, నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న రామాయణ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ VFX దిగ్గజం DNEG అధినేత నమిత్ మల్హోత్రా నిర్మించారు.

Published on: Nov 13, 2026 11:59 AM
Loading...
Unable to load recommendations.
Follow Us