Vishnu Vinyasam: కామెడీతో విన్యాసాలు చేస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్

Edited By:

Updated on: Feb 20, 2026 | 5:33 PM

శ్రీ విష్ణు కామెడీ అంటే తెరపై ఆయనదే రాజ్యం. 'విష్ణు విన్యాసం' టీజర్ విడుదలైంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌కు తిరిగివచ్చిన విష్ణు, పంచులతో నవ్వులు పూయించనున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మొదట మృత్యుంజయ్ చిత్రంతో క్లాష్ ఉన్నా, ఆ చిత్రం మార్చి 6కు వాయిదా పడటంతో విష్ణు వర్సెస్ విష్ణు పోరు తప్పింది. ఈ కామెడీ కింగ్ మళ్లీ ప్రేక్షకులను అలరించనున్నాడు.

ఒక్కో హీరోకు ఒక్కో స్ట్రాంగ్ జోన్ ఉంటుంది.. ఆ జోన్‌లోకి వెళ్లారంటే వాళ్లను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీ విష్ణుకు కూడా అలాంటి స్ట్రాంగ్ జోన్ ఒకటుంది.. మనోడు ఎంటర్‌టైన్మెంట్‌లోకి వచ్చాడంటే చాలు స్క్రీన్ మీద ఏ ఒక్కరూ కనబడరు. మొత్తమంతా విష్ణు విన్యాసమే..! మరి అలాంటిది టైటిలే విష్ణు విన్యాసం అయితే..? అదెలా ఉంటుందో ఓసారి చూద్దామా..? చూస్తున్నారుగా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్.. పూర్తిగా తనకు కలిసొచ్చిన ఎంటర్‌టైన్మెంట్ జోన్‌లోకి వచ్చేసారు శ్రీ విష్ణు. మధ్యలో మృత్యుంజయ్ అంటూ కాస్త సీరియస్‌గా ట్రై చేసినా.. ఈ హీరో స్ట్రాంగ్ జోన్ మాత్రం కామెడీ జోనరే. గత కొన్నేళ్లుగా సామజవరగమనా, ఓం భీమ్ బుష్, సింగిల్ అంటూ వరసగా ఎంటర్‌టైన్మెంట్ సినిమాలతో రప్ఫాడిస్తున్నారు శ్రీ విష్ణు. విష్ణు విన్యాసం టీజర్ విడుదలైందిప్పుడు.. ఫిబ్రవరి 28న ఈ సినిమా విడుదల కానుంది. టీజర్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ బాగానే పెంచేసారు మేకర్స్. ఆయ్ ఫేమ్ నయన్ సారిక ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్ అంతా ఓన్లీ కామెడీపైనే ఫోకస్ చేసారు దర్శకుడు యధునాథ్ మారుతిరావు. ముఖ్యంగా శ్రీ విష్ణు తనదైన పంచులతో రెచ్చిపోయారు. విష్ణు విన్యాసం ఫిబ్రవరి 28న విడుదల కానుండగా.. దానికి ఒక్కరోజు ముందు మృత్యుంజయ్ రానుందని ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమా వారం రోజులు వాయిదా పడనుందని.. మార్చి 6న మృత్యుంజయ్ రానుందని తెలుస్తుంది. అదే జరిగితే శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు పోరుకు బ్రేకులు పడ్డట్లే. మొత్తానికి మరోసారి కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ వినోదాల విన్యాసం ఎలా ఉండబోతుందో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: ఒకటి కాదు రెండు.. చరణ్‌కు లెక్కల మాస్టారు ట్విస్ట్

Keerthy Suresh: గ్యాప్ ఇవ్వలేదు.. తీసుకున్నా అంటున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా

ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్‌ చేసిన కంపెనీ

ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం

Loading...
Unable to load recommendations.
Follow Us