ఫస్ట్ అటెంప్ట్ తో ఆకట్టుకుంటున్న కెప్టెన్స్
అప్పటిదాకా వెయిట్ చేసిన ఆడియన్స్ కి వెరీ ఫస్ట్ ట్రీట్ ఎలా ఉండాలంటే.. కొడ్తే దిమ్మదిరిగిపోయేటట్టు ఉండాలి. ఇప్పుడు అలాంటి వైబ్ కోసమే ట్రై చేస్తున్నారు కెప్టెన్లు. ఇప్పుడు సెట్స్ మీదున్న చాలా సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోలు ఫ్యాన్స్ కి కడుపునిండే ఫీస్ట్ అరేంజ్ చేసేశాయి. వీటిని ఎలా మించాలా అని ఆలోచిస్తున్నారు ఫోర్త్ కమింగ్ డైరక్టర్స్.
స్పిరిట్ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్‌కి దారి తీసింది. వితౌట్ ఫేసెస్.. ఒన్లీ వాయిసెస్‌తో ఎంత ఇంటెన్స్ క్రియేట్ చేశారని మాట్లాడుకుంటున్నారు జనాలు. చూడబోయే సినిమాకు సందీప్ ఇచ్చిన ట్రీట్ మాత్రం అదిరిందంటున్నారు ఫ్యాన్స్. పనిలో పనిగా అల్లు అర్జున్ వీడియో కూడా గుర్తుచేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అట్లీ తెరకెక్కించబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది అనౌన్స్ మెంట్ వీడియో. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వీడియో. మా స్టార్ రేంజ్ గ్లోబల్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. అట్లీ మాత్రమే కాదు.. నెల్సన్ కూడా తలైవర్ జైలర్ సీక్వెల్‌కి సంబంధించి ఇచ్చిన వీడియో తెగ వైరల్ అయింది. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో వైరల్ అయితే, మన దగ్గర మెగాబాస్ చిరంజీవి టెక్నీషియన్స్ ని పరిచయం చేసుకున్న క్లిప్ ఇన్‌స్టంట్‌గా స్ప్రెడ్ అయింది. మెయిన్ టెక్నీషియన్స్ ని అద్భుతంగా పరిచయం చేశారని సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు అనిల్ రావిపూడి. నియర్ ఫ్యూచర్‌లో స్టార్ హీరోల సినిమాల అనౌన్స్ మెంట్స్ లో ఇంకెంత ఇన్నొవేషన్ కనిపిస్తుందోననే ఆసక్తి మాత్రం గట్టిగా క్రియేట్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిఖిల్ స్వయంభు ఆలస్యానికి కారణం ఏంటి..?
Pooja Hegde: నయా స్ట్రాటజీ ఫాలో అవుతున్న పూజా
Kriti Sanon: మంచి కాన్సెప్టులతో పలకరిస్తానన్న కృతి సనన్
