‘పెళ్లికి ముందే అమ్మాయితో అసభ్యంగా దొరికాడు.. కోపంతో చితకొట్టిన క్రికెటర్’
స్మృతి మందన-పలాష్ ముచ్ఛల్ పెళ్లి రద్దుపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు పలాష్ మరో అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడని స్మృతి బాల్య మిత్రుడు విద్యాన్ మానే వెల్లడించారు. ఇదే కారణంతో స్మృతి పెళ్లిని రద్దు చేసుకుందని తెలిపారు. అంతేగాక, పలాష్ తనను రూ. 40 లక్షలు మోసం చేశాడని విద్యాన్ మానే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆఫ్టర్ గ్రాండ్ సంగీత్ ఈవెంట్.. అనూహ్య పరిణామాల మధ్య.. పలాష్ ముచ్చల్, క్రికెటర్ స్మృతి మందన పెళ్లి ఆగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పలాష్ మరో అమ్మాయితో చేసిన చాటింగ్, డేటింగ్ స్క్రీన్ షాట్స్ బయటికి రావడంతోనే… స్మృతి పెళ్లి రద్దు చేసుకుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆ వార్త పై ఇన్ని రోజులకు స్మృతి చిన్న నాటి ఫ్రెండ్ ఫైనాన్సియర్ విద్యాన్ మానే రియాక్టయ్యారు. పెళ్లికి ముందు.. పలాష్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకరమైన స్థితిలో ఓ గదిలో.. రెడ్ హ్యాండెడ్‌గా స్మృతికి దొరికాడని.. దీంతో స్మృతి… ఆమె క్రికెట్ టీం ఫ్రెండ్స్, పలాష్‌ను కొట్టారంటూ చెప్పుకొచ్చాడు. ఆ ఘటన తర్వాతే పెళ్లి రద్దుచేసుకుని అందరూ వెళ్లిపోయారని అన్నారు. దీంతో ఈయన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. విద్యాన్ మానే.. పలాష్ పై ఛీటింగ్ కేసు కూడా నమోదు చేశాడు. సినిమా డైరెక్ట్ చేస్తానంటూ తన దగ్గర 40 లక్షలు తీసుకుని ఇవ్వడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం.. పువ్వులు చల్లిన స్థానికులు
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం
బైక్, కారు రిజిస్ట్రేషన్స్ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు
8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత