సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్‌! ఇంట్రెస్టింగ్‌గా సాత్విక స్టోరీ!

Updated on: Nov 17, 2026 | 4:54 PM

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన సాత్విక వీరవల్లి ఇప్పుడు హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆమె కథానాయికగా పరిచయం కానున్నారు. నటనపై ఆసక్తితో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె, ఈ చిత్రంలో కల్పన అనే పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు. అంతరిక్షంలోకి వెళ్లాలనే కలను నిజం చేసుకోవాలనుకునే అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు.

మలయాళీ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆకాశంలో ఒక తార. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలుఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ ఈ మూవీ నవంబర్ 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి అనే తెలుగమ్మాయి కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆమె సినిమా విశేషాలతో పాటు తన ప్రయాణాన్ని పంచుకున్నారు. అమెరికాలో పుట్టి పెరిగిన సాత్విక, తన మాస్టర్స్ పూర్తి చేశాక ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచే కళల పట్ల ఉన్న అంతులేని మక్కువతో నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. తండ్రి తెలుగువారు, తల్లి కోల్‌కతాకు చెందినవారైనా.. కుటుంబం చెన్నైలో స్థిరపడటంతో సాత్వికకు దక్షిణాది సంస్కృతి, భాషలతో మంచి అనుబంధం ఏర్పడింది. మొదట దుల్కర్ లీడ్ చేసిన‘కాంత’ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చినప్పటికీ అప్పుడు అవకాశం రాలేదు. కానీ అదే బ్యానర్‌లో మరో తమిళ ప్రాజెక్ట్‌కు ఎంపికై ఆమె ఇండియాకు వచ్చారు. సరిగ్గా అదే సమయంలో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ సాత్వికకు వచ్చింది. ఇక ఈ క్రేజీ ఆఫర్‌తో అమెరికాలోని తన ఉద్యోగానికి పూర్తిగా రాజీనామా చేసి, ఫుల్‌టైమ్ నటిగా మారిపోయారు సాత్విక. ఒక్క సినిమా చేసి వెళ్దామనుకున్న ఆమెకు, ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక ఆకాశంలో ఒక తార సినిమాలో.. తాను కల్పన అనే ఒక స్వచ్ఛమైన, అమాయకపు పల్లెటూరి యువతిగా కనిపించనున్నట్లు సాత్విక చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కామ్ గా ఉంటూ, ఆకాశంలోకి, అంతరిక్షంలోకి వెళ్లాలనే ఒక అసాధారణమైన గొప్ప కల కనే అమ్మాయి పాత్ర తనదని చెప్పుకొచ్చారు. చుట్టూ ఉన్నవారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, నిరుత్సాహపరిచినా తన లక్ష్యం వైపే అడుగులు వేసే కల్పన పాత్ర ప్రతి ఒక్కరికీ చక్కటి స్ఫూర్తినిస్తుందని ఆమె ఎంతో ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మోడరన్ వాతావరణంలో పెరిగిన సాత్వికకు, ఒక పల్లెటూరి అమ్మాయి బాడీ లాంగ్వేజ్‌ని ఒదిగిపోవడం పెద్ద సవాలుగా నిలిచిందట. దీనికోసం ఆమె ప్రత్యేకంగా తెలుగు భాషపై పట్టు సాధించేందుకు శిక్షణ కూడా తీసుకున్నారు. సాత్వికకు నటనతో పాటు కర్ణాటక సంగీతం, భరతనాట్యంలోనూ అద్భుతమైన ప్రావీణ్యం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్‌ రోజూ కష్టపడుతున్నాడట!

తండ్రి Vs కొడుకు.. బాక్సాఫీస్ వద్ద విచిత్ర పోరు!

Chiranjeevi: ఆ నీఛులపై.. గురి పెట్టిన మెగాస్టార్

Ashu Reddy: పెళ్లి గిల్లీ సెట్టవ్వవు.. అప్పట్లో తాగేదాన్ని కానీ ఇప్పుడు..

Loading...
Unable to load recommendations.
Follow Us