Spirit: కరీనా ప్లేస్‌లో మలయాళ బ్యూటీకి ఛాన్స్
ప్రభాస్ స్పిరిట్ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ అప్‌డేట్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరోయిన్‌గా దీపికా స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. ఇప్పుడు మరో కీలక పాత్రకు కరీనా కపూర్ బదులు మలయాళీ నటి మడోనా సెబాస్టియన్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది.
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ డ్రామా స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా జాగ్రత్తగా విడుదల చేస్తున్నారు. తాజాగా నటీనటుల ఎంపికలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. ముందుగా, ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను తీసుకోవాలని భావించినప్పటికీ, ఆమె డిమాండ్స్ కారణంగా ఆమెను పక్కనపెట్టి, యానిమల్ సెన్సేషన్ త్రిప్తి డిమ్రికి అవకాశం కల్పించారు. ఈ నిర్ణయం పరిశ్రమలో చాలామందిని ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మళ్లీ మొదలైన యానిమేటెడ్ మూవీస్ ట్రెండ్
విజయదశమికి ముహూర్తాలు పెడుతున్న హీరోలు
OG యూనివర్స్‌పై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన
ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం
