Samyuktha: కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్న సంయుక్త.. చురకత్తి లా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ
గతానికి భిన్నంగా, సంయుక్త మీనన్ కెరీర్ ఆరంభంలోనే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె రాబోయే యాక్షన్ చిత్రంలో పోలీస్ అధికారిణిగా నటించనున్నారు, ప్రమాదకరమైన స్టంట్స్‌ను డూప్ లేకుండా చేస్తున్నారు. సంయుక్త మీనన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో కథానాయికలు కెరీర్ చివరి దశలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. కెరీర్ ప్రారంభంలోనే నటీమణులు సినిమా బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. ఈ కోవలోకి వచ్చిన సంయుక్త మీనన్ తన రాబోయే సినిమా కోసం రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యారు. భీమ్లా నాయక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త మీనన్, ప్రస్తుతం తెలుగు మార్కెట్ పైనే ఎక్కువగా దృష్టి సారించారు. సినిమా ఎంపిక విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న ఆమె, కెరీర్ ప్రారంభంలోనే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్రారంభించిన సంయుక్త మీనన్, ఆ చిత్రానికి స్వయంగా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కథానాయికగా పూర్తిగా స్థిరపడకముందే ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరిస్తున్న స్టార్ హీరోల క్రాస్ ఓవర్ చిత్రాలు
యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా
పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు
Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్
