Samantha: నా ప్రతి ప్రయాణం.. సవాళ్లతోనే మొదలవుతుంది

Updated on: Feb 13, 2026 | 1:23 PM

సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా మానసిక స్థైర్యం, సవాళ్లను అధిగమించడం గురించి స్ఫూర్తినిచ్చారు. ఆమె వ్యక్తిగత ఎదుగుదలను తెలియజేస్తూ, టీమ్ ఇండియాకు మద్దతు పలికారు. అభిమానులు ఆమెను "రియల్ లైఫ్ ఫైటర్"గా కీర్తించారు. నటిగా, నిర్మాతగా కెరీర్ కొనసాగిస్తూనే, భర్త రాజ్ నిడిమోరు కోసం తన పేరును 'సమంత నిడిమోరు'గా మార్చుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ఈ మార్పును ప్రకటించే అవకాశం ఉంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన వ్యక్తిగత ఎదుగుదల, కష్టాలను ఎదుర్కొన్న తీరును ప్రతిబింబించేలా ఆమె వ్యాఖ్యలు చేసింది. ప్రతి ప్రయాణం సవాళ్లతోనే మొదలవుతుంది. ఆ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే మానసిక స్థైర్యం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకు సాగి, గమ్యాన్ని ముద్దాడాలనుకునే ప్రతి కలకు తన మద్దతు ఉంటుంది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ద్వారా టీమ్ ఇండియా క్రీడాకారులకు తన ప్రోత్సాహాన్ని తెలియజేసింది. ఏ రంగంలోనైనా గెలవాలంటే శారీరక శక్తితో పాటు మానసిక స్థైర్యం కూడా చాలా అవసరమని ఆమె సందేశం ఇచ్చింది. సమంత మాటల్లోని గాంభీర్యం చూసి అభిమానులు “రియల్ లైఫ్ ఫైటర్” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సమంత ఒకవైపు హీరోయిన్‌గా నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఇటీవల సొంత ప్రొడక్షన్‌ ట్రాలాలా స్టార్ట్‌ చేసి.. మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’గతేడాది రిలీజై మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గుడపుపుతోంది. భర్త రాజ్‌ నిడిమోరు కోసం సామ్‌ కీలక నిర్ణయం తీసుకుందంటూ ఓ క్రేజీ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. భర్త కోసం తన ఇంటి పేరుని మార్చకోబోతుంది సమంత. ఇన్నాళ్లు సమంత రూత్‌ప్రభుగా ఉన్న తన పేరుని..ఇప్పుడు సమంత నిడిమోరుగా మార్చుకోబోతుందట. ‘మా ఇంటి బంగారం’ సినిమాతోనే తన కొత్త పేరుని ఫ్యాన్స్‌కి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్‌ కార్డ్‌లో సమంత పేరుని ‘సమంత నిడిమోరు’గా వేయాబోతున్నారని టాక్‌. అంతేకాదు తన సోషల్‌ మీడియా ఖాతాల్లోనూ ఇదే పేరుని మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే పేరు మార్చుకుంటుందా లేదా అనేది తెలియాలంటే.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌ వరకు ఆగాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Karthikeya 3: కార్తీకేయ3 గురించి క్లారిటీ ఇచ్చిన నిఖిల్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే

Venkatesh: వరుస ప్రాజెక్ట్స్ తో విక్టరీ వెంకటేష్ జోరు.. క్యూ కడుతున్న దర్శకులు

నటనలో భేష్.. చదువుల్లో శభాష్ అనిపిస్తున్న హీరోయిన్లు

హిట్ కోసం సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేస్తున్న స్టార్ హీరోలు

బాలీవుడ్ హీరోలకు డేంజర్ బెల్స్.. హీరోలకు పెరుగుతున్న బెదిరింపులు