వారణాసి గురించి మేజర్ అప్‌డేట్ రివీల్ చేసిన రాజమౌళి
మహేష్ బాబు చిత్రం వారణాసిపై దర్శకుడు రాజమౌళి కీలక అప్‌డేట్‌లు ఇచ్చారు. షూటింగ్ 50% పూర్తయిందని, రామాయణ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. జూన్ 2026 నాటికి షూటింగ్ పూర్తయి, ఏప్రిల్ 7, 2027న సినిమా విడుదల కానుంది. VFX కోసం కష్టపడుతున్నామని పేర్కొన్నారు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంపై పలు ఆసక్తికర అప్‌డేట్‌లు వెల్లడయ్యాయి. గత చిత్రాలకు భిన్నంగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంకలు వారణాసి సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రస్తుతం వారణాసి షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే సినిమా షూటింగ్ 50% పూర్తయింది. ఇందులో కీలక సన్నివేశాలు చాలా వరకు చిత్రీకరించినట్లు వెల్లడించారు. తన కెరీర్‌లోనే అత్యంత కష్టమైన సన్నివేశంగా భావించిన రామాయణ సీక్వెన్స్‌ను కూడా పూర్తి చేసినట్లు రాజమౌళి తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
రామ్ చరణ్, ఉపాసన కవలల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!
బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!
బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!