పాతిక చిత్రాల కౌంట్ తో దూసుకుపోతున్న రష్మిక

Edited By: Phani CH

Updated on: Oct 29, 2025 | 3:15 PM

మంచి సినిమాల్లో మనం ఉండటం వేరు.. మనం ఉన్న సినిమాలు వావ్‌ అనిపించడం వేరు. రష్మిక విషయంలో ఏది వర్కవుట్‌ అవుతుందో ఏమోగానీ... కమర్షియల్‌ సక్సెస్‌లకి కేరాఫ్‌గా మారిపోయారు రష్మిక. ఈ ఫేజ్‌ని ఆమె ఎంజాయ్‌ చేస్తున్నారా? అసలు మిస్‌ మందన్న మనసులో ఏముంది? బాక్సాఫీస్‌ నెంబర్లు, సక్సెస్‌ కంటే.. మంచి సినిమా చేసినప్పుడు వచ్చే కిక్‌ వేరే లెవల్లో ఉంటుందంటున్నారు రష్మిక మందన్న.

ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలనే తపన రోజురోజుకీ పెరుగుతోందంటున్నారీ బ్యూటీ. కెరీర్‌లో పది సినిమాలు చేసినా గుర్తుండిపోవాలన్నది రష్మిక మైండ్‌లో ఎప్పుడూ ఉంటుందట. తాను స్టోరీస్‌ వినేటప్పుడు కూడా అదే ధ్యాసతోనే వింటారట. ది గర్ల్ ఫ్రెండ్‌ అలాంటి సినిమా అవుతుందని, తప్పకుండా క్లిక్‌ అవుతుందని, సినిమా విడుదలయ్యాకే రెమ్యునరేషన్‌ తీసుకుంటాననీ చెప్పారు. బ్యాక్‌ టు బ్యాక్‌ ఇన్ని కమర్షియల్‌ సినిమాలు లిస్టులో ఉండటం మామూలు విషయం కాదంటున్నారు క్రిటిక్స్. నార్త్, సౌత్‌ అనే తేడా లేకుండా వెయ్యి కోట్ల సినిమాలతో రష్మిక సక్సెస్‌ అవుతుండటం హ్యాపీగా ఉందన్నది ఫ్యాన్స్ మాట. నెక్స్ట్ ఇయర్‌ కూడా రష్మిక హవా కొనసాగుతుందనే నమ్మకం ఉందంటున్నారు అభిమానులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫస్ట్ అటెంప్ట్ తో ఆకట్టుకుంటున్న కెప్టెన్స్

నిఖిల్ స్వయంభు ఆలస్యానికి కారణం ఏంటి..?

Pooja Hegde: నయా స్ట్రాటజీ ఫాలో అవుతున్న పూజా

Kriti Sanon: మంచి కాన్సెప్టులతో పలకరిస్తానన్న కృతి సనన్

Mohanlal: త్వరలో దృశ్యం త్రీక్వెల్ సెట్‌ కు మోహన్ లాల్‌