రామాయణ ట్రైలర్‌ టాక్‌… అంచనాలను అందుకుందా?

Edited By:

Updated on: Aug 02, 2026 | 1:05 PM

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘రామాయణ పార్ట్-1’ ట్రైలర్ ప్రేక్షకులను విజువల్ వండర్‌తో ఆకట్టుకుంది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, డీఎన్‌ఈజీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అయితే హనుమంతుడి పాత్ర కనిపించకపోవడం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

వరల్డ్‌ ఆడియన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రామాయణ’ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌ రాముడిగా, సౌత్‌ హీరో యష్ రావణుడిగా నటిస్తున్న రామాయణ మీద గ్లోబల్‌ రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ట్రైలర్‌ ఆ అంచనాలను అందుకుందా…? 4 నిమిషాల 9 సెకన్ల విజువల్ ట్రీట్‌లో హైలైట్ అయిన అంశాలేంటి? ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఏంటి? ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మరో బిగ్గెస్ట్ విజువల్ వండర్ రిలీజ్‌ సిద్ధమవుతోంది. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘రామాయణ- పార్ట్ 1’ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సుమారు 4 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే గ్లోబల్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన విజువల్ గ్రాండియర్‌కు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో తన కళ్ళతోనే ఎమోషన్ పలికిస్తే.. రావణాసురుడిగా యష్‌ ఎంట్రీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. మరోవైపు హన్స్ జిమ్మర్, ఏ.ఆర్.రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. ఆస్కార్ విన్నింగ్ స్టూడియో ‘DNEG’ క్రియేట్ చేసిన వీఎఫ్ఎక్స్, లంక సెట్టింగ్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. సీతగా సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో ఇన్ని హైలైట్స్ ఉన్నా.. కొన్ని మిస్సింగ్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌ను కాస్త డిసప్పాయింట్ చేశాయి. ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో హనుమంతుడి పాత్రను ఎక్కడా చూపించకపోవడం మీద డిస్కషన్ జరుగుతోంది. తొలి భాగం సీతాపహరణం వరకు మాత్రమే కావటంతో ఈ భాగంలో హనుమంతుడి ఎంట్రీ ఉండదు. అందుకే ట్రైలర్‌లోనూ వానర సైన్యం, హనుమంతుడు, వాలి సుగ్రీవులను చూపించలేదు. రామాయణం లాంటి హైలీ సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో ప్రెజెంట్ చేస్తున్న రామాయణ టీమ్.. కంటెంట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. రణ్‌బీర్ యాక్టింగ్, యష్‌ స్వాగ్, గ్రాండ్‌ విజువల్స్‌తో ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్ మీద ఉన్న అని రికార్డులు చెరిగిపోవటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Burj Khalifa: గుడ్‌న్యూస్.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు

వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు

మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తోందా.. ఇదిగో సరికొత్త ట్రిక్ ‘కాఫీ నాప్’

ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సురక్షితమేనా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!

Loading...
Unable to load recommendations.
Follow Us