Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్
నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలో సీతాదేవిని యోధురాలిగా చూపించడంపై వస్తున్న విమర్శలకు దర్శకుడు స్పందించారు. అద్భుత రామాయణం, బిలంక రామాయణం వంటి పురాణ కథనాల్లో సీత దుష్టశక్తులతో పోరాడినట్లు వివరించారు. సహస్ర రావణుడిని సీత మహాకాళి రూపంలో సంహరించిన ఘట్టాన్ని ప్రస్తావిస్తూ, సినిమాలో ఆమెను శక్తిమంతమైన యోధురాలిగా చూపించడానికి సాహిత్య ఆధారాలు ఉన్నాయని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
రణ్ బీర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా.. యశ్ రావణాసురిడిగా.. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన సినిమానే రామాయణ రైజ్ ఆఫ్ ఏ లెజెండ్. రిలీజ్ డే నుంచి అందర్నీ ఆకట్టుకుంటూ.. కలెక్షన్స్ కొల్లగొడుతూ వస్తోన్న ఈ మూవీని.. ఓ విమర్శ మాత్రం ఇప్పటికీ వెంటాడుతోంది. అదే.. సాత్వికురాలైన సీతా దేవిని యోధురాలిగా ఎలా చూపిస్తారని’! అయితే ఈ విమర్శపై ఇన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న డైరెక్టర్ నితేష్ తివారి.. తాజాగా తన రీసెంట్ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. కొన్ని పురణాలు.. ఇతిహాసాలను సాక్ష్యాలుగా చూపిస్తూ.. సీత యోధురాలే.. అంటూ మరో సారి తను తెరకెక్కించిర రామాయణాన్ని సమర్ధించుకున్నారు ఈయన. సీతను కేవలం కష్టాలను భరించే మహిళగా కాకుండా, అపారమైన శక్తికి ప్రతిరూపంగా, అవసరమైనప్పుడు దుష్టశక్తులను ఎదుర్కొనే యోధురాలిగా చిత్రీకరించడానికి భారతీయ ఇతిహాసాల్లోనే ఆధారాలు ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా సంస్కృతంలోని ‘అద్భుత రామాయణం’, 15వ శతాబ్దానికి చెందిన ఒడియా ‘బిలంక రామాయణం’లో సీత పాత్ర చాలా.. భిన్నంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కథనాల్లో సీత కేవలం సహనానికి, త్యాగానికి ప్రతీక మాత్రమే కాదని.. క్రియాశీలకంగా దుష్టశక్తులతో పోరాడే యోధురాలని, విశ్వశక్తి స్వరూపిణి అని వివరించారు. నితేష్ తివారీ ప్రస్తావించిన అంశాల్లో అత్యంత ఆసక్తికరమైనది సహస్ర రావణుడి కథ. కొన్ని రామాయణ కథనాల ప్రకారం.. రావణుడికంటే అత్యంత శక్తిమంతుడైన వెయ్యి తలల సహస్ర రావణుడితో యుద్ధం చేసే సమయంలో శ్రీరాముడు సైతం నిస్సహాయ స్థితికి చేరుకుంటాడు. అప్పుడు సీత తన అసలైన దివ్యశక్తిని ఆవిష్కరిస్తూ మహాకాళి రూపాన్ని ధరించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఈ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ.. సీతలోని యోధురాలి కోణం ఆధునిక కాలంలో సృష్టించిన కొత్త ఆలోచన కాదని, భారతీయ రామాయణ సంప్రదాయాల్లోనే అలాంటి కథనాలు ఉన్నాయని దర్శకుడు వివరణ ఇచ్చారు. నిర్దిష్టమైన సాహిత్య ఆధారాల మేరకే తన సినిమాలోని సీతను సాత్వికురాలిగా కాకుండా.. యోధురాలిగా చూపించానంటూ రామాయణ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్! ఇంట్రెస్టింగ్గా సాత్విక స్టోరీ!
Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్ రోజూ కష్టపడుతున్నాడట!
తండ్రి Vs కొడుకు.. బాక్సాఫీస్ వద్ద విచిత్ర పోరు!
Chiranjeevi: ఆ నీఛులపై.. గురి పెట్టిన మెగాస్టార్
Ashu Reddy: పెళ్లి గిల్లీ సెట్టవ్వవు.. అప్పట్లో తాగేదాన్ని కానీ ఇప్పుడు..
