నిన్ను తీసుకెళ్లిన ఆ దేవుడిని చంపాలనిపిస్తోంది! నానా మరణంతో ఆర్జీవీలో ఉప్పొంగిన భావోద్వేగం

Updated on: Oct 09, 2026 | 5:00 PM

నానా పటేకర్‌ మరణవార్తపై దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కథనం చెబుతోంది. అంతటి ధృఢమైన వ్యక్తికి ఇంత అకస్మాత్తుగా మరణం వస్తుందని నమ్మలేకపోతున్నానని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. నానా పటేకర్‌ గుండెను ద్వేషిస్తున్నానంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ‘అబ్‌ తక్‌ చప్పన్‌’, ‘భూత్‌’, ‘ది అటాక్స్‌ ఆఫ్‌ 26/11’ చిత్రాల్లో ఆయన నటనను ఎప్పటికీ మరిచిపోలేనని వర్మ నివాళులర్పించినట్లు కథనం పేర్కొంది.

ప్రముఖ దిగ్గజ నటుడు నానా పాటేకర్ ఆకస్మిక మృతి సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 75 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయితే ఆయన హఠాన్మరణంపై ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగభరితమైన నివాళులు అర్పించారు. నానా పాటేకర్ లాంటి ధృఢమైన వ్యక్తికి ఇలా అకస్మాత్తుగా జరగడాన్ని తాను నమ్మలేకపోతున్నానని వర్మ ఎమోషనల్ అయ్యారు. ఎవరూ అమరులు కాదనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ అంతటి ధృఢమైన వ్యక్తికి ఇంత అకస్మాత్తుగా మరణం వస్తుందని తానైతే అసలు నమ్మలేకపోతున్నానంటూ ఆర్జీవీ ఎమోషనల్ అయ్యారు. ఆయనను మోసం చేసిన గుండెను ద్వేషిస్తున్నాను. అలాగే నటనకు దేవుడైన నానా పాటేకర్ ను బలిగొన్న ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోందంటూ తన ఫీలింగ్స్‌కు అక్షరరూపమిచ్చారు వర్మ. గుడ్‌బై నానా.. ‘అబ్ తక్ చ‌ప్ప‌న్’, ‘భూత్’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ చిత్రాల ద్వారా మీరు అందించిన అద్భుతమైన నటనను ఎప్పటికీ మర‌చిపోలేను” అని ఆర్జీవీ తన ఆవేదనను పంచుకున్నారు. నానా పాటేకర్ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు తీరని లోటని పలువురు ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

Aggipetta Macha Game: అగ్గిపెట్టె మచ్చా మీద.. ఏకంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌ ఉంది తెలుసా?

Bigg Boss Telugu 10: 15 లక్షల్లో.. మిథిలేష్‌కు మిగిలేది మరీ అంతేనా.. ఏదో అనుకున్నాడు పాపం!

OTTలో మెంటలెక్కించే క్రైమ్‌ థ్రిల్లర్ ఈ సినిమా ఎలా ఉందంటే…?

Loading...
Unable to load recommendations.
Follow Us