Rakul Preet Singh: మీరు అనుకుంటున్నట్టు నాకు ఎవరూ గిఫ్ట్‌లు.. విల్లాలు ఇవ్వలేదు!

Updated on: Oct 07, 2026 | 10:03 PM

ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు సంబంధించి తనపై వస్తున్న వార్తలను నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఖండించారు. తనకు అక్రమ విదేశీ నగదు బదిలీలు, బినామీ ఆస్తులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 20 ఏళ్ల వయసు నుంచే పన్నులను సక్రమంగా చెల్లిస్తున్న బాధ్యతాయుతమైన పన్ను చెల్లింపుదారినని తెలిపారు. వాస్తవాలు నిర్ధారించుకోకుండా తప్పుడు, ఊహాజనిత కథనాలను ప్రచురించిన వారు వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలకు సంబంధించి తనపై వస్తున్న వార్తలను ఖండించారు. వాస్తవాలను తెలుసుకోకుండా కొందరు ఆన్‌లైన్‌ రిపోర్టర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు వార్తలను సంచలనంగా ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సంచలనంగా ప్రచారం చేసే ధోరణి పెరుగుతోందని.. ఈ విషయం గురించి ఒకసారి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాననంటూ ఆమె తన ప్రకటనలో రాసుకొచ్చారు. ఆదాయపు పన్ను శాఖ చేసిన సోదాలు తనకు సంబంధించినవి కావన్నారు. తాను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చానని.. సినీ పరిశ్రమలో తనకు గాడ్‌ఫాదర్‌ లేరని.. తన నా కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానంటూ రకల్ రాసుకొచ్చారు. 20 ఏళ్ల వయసు నుంచే బాధ్యత కలిగిన పౌరురాలిగా తాను పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానంటూ తన పోస్టులో కోట్ చేశారు రకుల్. తన వ్యక్తిగత హోదాలో గానీ, ఏదైనా నిర్మాణ సంస్థ తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ నగదు బదిలీలతో తనకు సంబంధం లేదు రకుల్ స్పష్టం చేశారు. దేశవిదేశాల్లో ఎవరి పేరుతోనూ బినామీ ఆస్తులు తనకు లేవని.. అలాగే ఎవరూ తనకు ఎప్పుడూ విలువైన ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదని.. అలాంటి ఖరీదైన బహుమతులను స్వీకరించకూడదనేది తన సూత్రం అంటారు ఆమె తన పోస్టులో మెన్షన్ చేశారు. తన గురించి తప్పుడు, హానికరమైన, ఊహాజనిత వార్తలు ప్రచురించిన వారు వాటిని వెనక్కి తీసుకుని వాస్తవాలను స్పష్టం చేయాలని రకుల్ రిక్వెస్ట్ చేశారు.తాను చట్టపరమైన, ఆర్థిక బాధ్యతలను ఎప్పటికప్పుడు పాటిస్తూ బాధ్యతాయుతమైన పన్ను టాక్స్‌ పేయర్‌గా ఉన్నానని రకుల్‌ ప్రీత్ సింగ్‌ స్పష్టం చేశారు. ఇటీవలి ఐటీ సోదాలకు సంబంధించి తనపై వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని చెబుతూ తన వైఖరిని స్ట్రాంగ్‌గా స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Janhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు

Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..

పవన్‌తో సింగీతం ‘జీసెస్’ సినిమా చేద్దామనుకున్నారట.. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిదంటే

Loading...
Unable to load recommendations.
Follow Us