Rajinikanth: కుర్ర హీరోలకు షాక్ ఇచ్చే రేంజ్‌లో తలైవా జోరు

Edited By:

Updated on: Oct 27, 2026 | 4:30 PM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు కథనం చెబుతోంది. ‘జైలర్‌ 2’ విజయాన్ని ఆస్వాదిస్తూనే ‘ధర్మన్‌’ షూటింగ్‌ను పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అనంతరం కమల్‌ హాసన్‌తో కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్‌ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దశాబ్దాల తర్వాత ఇద్దరు దిగ్గజాలు ఒకే సినిమాలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే సినిమా విడుదల, షూటింగ్‌ షెడ్యూల్‌పై అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంది.

వయసు పెరుగుతున్నా సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చూపిస్తున్నారు తలైవా. ఒకవైపు థియేటర్లలో భారీ వసూళ్లు కొల్లగొడుతూనే, మరోవైపు సెట్స్ మీద ఉన్న సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన జైలర్ 2 కూడా బాక్సాఫీస్ దగ్గర అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ భారీ వసూళ్లు సాధిస్తూ రజనీ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తోంది. ముత్తువేల్ పాండియన్‌గా తలైవా చూపించిన స్వాగ్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నాయి. జైలర్ 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు రజనీ. ధర్మన్ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఎలాంటి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతూ కోలీవుడ్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు సూపర్‌స్టార్. రజనీ లైనప్‌లో ఆడియన్స్‌ను ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కమల్ హాసన్ – రజనీకాంత్ మల్టీస్టారర్. దశాబ్దాల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ సెన్సేషనల్ మూవీ నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ధర్మన్ షూటింగ్ గుమ్మడికాయ కొట్టగానే ఈ మెగా మల్టీస్టారర్ సెట్స్‌లో జాయిన్ అయ్యేలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు తలైవా. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో నీటి కొరత.. ఎమర్జెన్సీ ప్రకటించిన వాటర్ బోర్డు

సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!

పండగ రద్దీకి చెక్‌.. దీపావళికి స్పెషల్‌ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌

పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే

చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us