రజనీ – కమల్‌ మూవీ.. స్టోరీ లీక్‌ !! కథ మామూలుగా లేదుగా

Updated on: Feb 10, 2026 | 4:21 PM

రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. నెల్సన్ దర్శకత్వంలో, అనిరుద్ సంగీతంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా స్క్రిప్ట్‌ను రజనీకాంత్ ఆమోదించారు. కమల్ హాసన్‌కు కూడా రిఫర్ చేయగా ఆయన కూడా ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ప్రోమో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం నవ్వుల ప్రధానంగా స్నేహం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం సినీ అభిమానులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రేక్షకులను నవ్వించడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. దశాబ్దాల తర్వాత ఈ అగ్ర తారలు కలిసి తెరపై కనిపించనున్నందున, ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సిద్ధం చేసిన మల్టీస్టారర్ స్క్రిప్ట్‌ను రజనీకాంత్ బాగా ఇష్టపడ్డారని, వెంటనే కమల్ హాసన్‌కు రిఫర్ చేశారని సమాచారం. కమల్ హాసన్ కూడా ఈ కథపై సానుకూలంగా ఉన్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగాస్టార్‌ నయా సెంటిమెంట్‌ రివీల్‌.. ఇక దుమ్ము దుమారమే

Venkatesh: హ్యాట్రిక్‌ ట్రయల్స్.. విక్టరీ హీరోకి వర్కవుట్‌ అవుతుందా

ప్యాన్‌ ఇండియా అంటే హింసేనా !! విజయానికి అదే మార్గమా

నమ్మకానికి అమ్మ వంటిది టాలీవుడ్.. అంటున్న నార్త్ భామలు

కూతుళ్లే.. కొడుకులై తండ్రికి అంతిమ వీడ్కోలు !