రాకా ప్రమోషన్స్‌కు ముహూర్తం.. బన్నీ ప్లాన్ ఏంటి?

Updated on: Nov 19, 2026 | 11:54 AM

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న రాకా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను ది బెస్ట్ కంటెంట్‌తో త్వరలో ప్రారంభించనున్నట్టు అల్లు అర్జున్ వెల్లడించారు. గిన్నిస్ రికార్డు, త్రిపుల్ రోల్ బజ్, గ్లోబల్ క్యాస్టింగ్, అవతార్ విజువల్స్‌తో సినిమా హైప్ సృష్టిస్తోంది.

పుష్ప 2 లాంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాకా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఏవీ వెలువడనప్పటికీ, తాజాగా అల్లు అర్జున్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ఇటీవల, రాకా వరల్డ్ నుంచి 37 మందితో రియల్ టైం మోషన్ క్యాప్చర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినట్లు మేకర్స్ తెలిపారు. అయితే, సినిమా కథాంశం, అల్లు అర్జున్ లుక్, అట్లీ బన్నీని ఎలా చూపించబోతున్నారనే విషయాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించి, ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే కాస్త ఆలస్యం అవుతుందని అల్లు అర్జున్ తెలిపారు. త్వరలో అద్భుతమైన కంటెంట్‌తో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు ఆయన ధృవీకరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us