మాక్కీ కిరికిరి.. విజయ్ చింపేశిండు మాటలతో కొట్టేసిన పూరీ
కోడ్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా డైలాగులు రాయడమే కాదు.. అదే రేంజ్‌లో మాట్లాడడం కూడా తెలుసు మన పూరీ జగన్నాథ్‌కు. మాట్లాడడం ఓకటే కాదు..
కోడ్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా డైలాగులు రాయడమే కాదు.. అదే రేంజ్‌లో మాట్లాడడం కూడా తెలుసు మన పూరీ జగన్నాథ్‌కు. మాట్లాడడం ఓకటే కాదు.. వింటున్న జనాలను కదిలించడం.. ఊగేలా చేయడం.. ఉక్కిరిబిక్కిరి చేయడం కూడా తెలుసు. అందుకే ఈ డైరెక్టర్ సినిమాల కంటే..ఆ సినిమాల త్రూ తను చెప్పే మాటలకే ఫ్యాన్స్ ఎక్కువ. ఆయన ఆలోచనలకే ఫాలోవర్స్ ఎక్కువ. ఇక తన లేటెస్ట్ ఫిల్మ్ లైగర్ ట్రైలర్ ఈవెంట్లో కూడా మరో సారి తన స్టైల్ ఆఫ్ మాటలతో.. థియేటర్ టాప్ లేచిపోయేలా చేశారు పూరీ. కరణ్ జోహార్ ని లైగర్ సినిమా ట్రైలర్ చూపించేదుకు ఇక్కడకు తీసుకురాలేదని.. మిమ్మల్ని చూపించేందుకే తీసుకువచ్చా అంటూ.. రౌడీ ఫ్యాన్స్ ను అరిపించారు పూరీ. ఇక విజయ్ దేవరకొండ గురించి మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు పూరీ. ట్రైలర్ ఎలా ఉందని VD ఫ్యాన్స్ ను అడుగుతూనే.. ‘మాక్కీ కిరికిరి.. విజయ్ చింపేశిండు కదా’.. అంటూ.. తన మాటలతో అందర్నీ అరిపించే ప్రయత్నం చేశారు పూరీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: