Prashanth Neel: ఒక్క అప్‌డేట్‌తో డబుల్‌ జోష్‌, ఖుషీ అవుతున్న తారక్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్

Edited By:

Updated on: Oct 27, 2026 | 4:33 PM

ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన అప్‌డేట్‌ అభిమానుల్లో ఆసక్తి పెంచింది. ‘సలార్‌ 2: శౌర్యాంగ పర్వం’ షూటింగ్‌ వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించినట్లు కథనం పేర్కొంటోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్‌’ సినిమా చేస్తున్న నీల్‌ తదుపరి ప్రభాస్‌ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. అయితే ఈ షెడ్యూల్‌ ఆధారంగా ‘డ్రాగన్‌’ విడుదల తేదీ ఖరారైందని చెప్పలేం.

కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఒక్క అప్‌డేట్‌తో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా నీల్ రిలీజ్ చేసిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ప్రశాంత్ నీల్ ఏం చెప్పారు..? ఈ స్టోరీలో చూద్దాం. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్‌తో ‘సలార్ 2’ పట్టాలెక్కించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో ఫ్యాన్స్‌లో కాస్త కన్ఫ్యూజన్ ఉండేది. అయితే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన వీడియోతో ఈ అనుమానాలన్నింటికీ చెక్ పెట్టారు ప్రశాంత్ నీల్. డార్లింగ్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రిలీజ్ చేసిన వీడియోలో.. అందరూ ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని రివీల్ చేశారు నీల్. ఈ ఒక్క మాటతో రెబల్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ‘శౌర్యాంగ పర్వం’ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు అసలైన ట్రీట్ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. జూన్‌లో ‘సలార్ 2’ షూటింగ్ మొదలవుతుందంటే.. అప్పటికే ఎన్టీఆర్-నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ పనులు పూర్తవుతాయని, అంటే డ్రాగన్ ఖచ్చితంగా జూన్‌లో రిలీజ్ అవుతుందని కన్ఫార్మ్ చేసినట్టే అంటున్నారు తారక్ ఫ్యాన్స్‌. మొత్తానికి బర్త్‌డే సందర్భంగా ఇద్దరు టాప్ హీరోల లైనప్‌ విషయంలో క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో నీటి కొరత.. ఎమర్జెన్సీ ప్రకటించిన వాటర్ బోర్డు

సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!

పండగ రద్దీకి చెక్‌.. దీపావళికి స్పెషల్‌ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌

పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే

చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us