Fauzi: ఫౌజీ టీజర్‌లో ఇంట్రస్టింగ్ హింట్స్
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫౌజీ’ చిత్రబృందం ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో తొలి టీజర్‌ను విడుదల చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చారిత్రక నేపథ్యానికి కల్పిత గూఢచారి కథను జోడించినట్లు టీజర్ హింట్స్ ఇస్తున్నాయి. భారీ మెషిన్ గన్‌తో ప్రభాస్ కనిపించిన సన్నివేశం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా 2027 మార్చి 19న విడుదల కానున్నట్లు కథనం పేర్కొంటోంది.
వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ప్రభాస్, నెక్ట్స్ ‘ఫౌజీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఇప్పటి వరకు పోస్టర్లతోనే సస్పెన్స్ క్రియేట్ చేసిన యూనిట్, ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్‌లో అసలు కథేంటో హింట్ ఇచ్చింది. ఆ హింట్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఇప్పటి వరకు ‘ఫౌజీ’ వరల్డ్ నుంచి కేవలం మిస్టీరియస్ పోస్టర్లు మాత్రమే రివీల్ అయ్యాయి. బంగారు నాణెం మీద ‘అజ్ఞాతపర్వ’, ‘మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932’, ‘ఒంటరిగా పోరాడే బెటాలియన్’ లాంటి క్లూస్‌తో హీరో క్యారెక్టర్ మీద క్యూరియాసిటీ పెంచింది యూనిట్. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘ఫైల్ నెంబర్ 25’ పేరుతో ఫస్ట్ టీజర్‌ను డీక్లాసిఫై చేశారు మేకర్స్. ఈ టీజర్‌ను డీకోడ్ చేస్తే ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ అవుతున్నాయి. టీజర్ ఓపెనింగ్‌లోనే 1942 రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బెర్లిన్‌లో జర్మన్ నియంత హిట్లర్‌ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలిసిన హిస్టారికల్ మీటింగ్‌ను చూపించారు. చరిత్రలో జరిగిన ఈ ఘటనకు ఫిక్షన్ జోడించి, ప్రభాస్‌ను నేతాజీ సీక్రెట్ సూపర్ స్పైగా పరిచయం చేశారు. జర్మన్ ‘ఎనిగ్మా’ కంటే కష్టమైన, కోడ్‌ను ‘భగవద్గీత’ ఆధారంగా సృష్టించిన వ్యూహకర్తగా హీరో క్యారెక్టర్‌కు నెక్ట్స్ లెవల్ ఎలివేషన్ ఇస్తూ సినిమా మీద బజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లారు. భారీ పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ చివర్లో భారీ మెషిన్ గన్‌తో ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. నేతాజీ నినాదానికి కొనసాగింపుగా.. బ్రిటిష్ సామ్రాజ్యం రక్తాన్ని కళ్లజూసి, వాళ్ల గుప్పిట్లో నుంచి స్వేచ్ఛను లాక్కుంటానంటూ వచ్చే వాయిస్ ఓవర్‌కు, ప్రభాస్ వింటేజ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 2027 మార్చి 19న రిలీజ్ కానున్న ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి రికార్డులు తిరగరాయటం ఖాయం అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో నీటి కొరత.. ఎమర్జెన్సీ ప్రకటించిన వాటర్ బోర్డు
సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!
పండగ రద్దీకి చెక్.. దీపావళికి స్పెషల్ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్