Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్

Edited By:

Updated on: Mar 28, 2026 | 11:32 AM

డార్లింగ్ ప్రభాస్ తన అప్‌కమింగ్ సినిమాల విషయంలో ఎవరి షరతులు వినడం లేదని స్పష్టమైంది. సందీప్ వంగా 'స్పిరిట్' కోసం అడిగిన బల్క్ డేట్స్, ఎక్స్‌క్లూజివిటీని ప్రభాస్ పక్కన పెట్టారు. ప్రస్తుతం 'కల్కి 2898 AD' షూటింగ్‌తో పాటు 'స్పిరిట్'కు కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ, మూడు సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ తన పాత వర్కింగ్ స్టైల్‌నే కొనసాగిస్తున్నారు.

ఏ రూల్‌ అయినా ఐ డోంట్‌ కేర్‌ అంటున్నారు డార్లింగ్ ప్రభాస్‌. అప్‌ కమింగ్ సినిమాల విషయంలో ప్రభాస్‌ స్టైల్‌ మార్చాల్సిందే అంటూ దర్శకులు పట్టు బట్టినా డార్లింగ్ వైపు నుంచి పెద్దగా కోపరేషన్ అయితే కనిపిస్తున్నట్టుగా లేదు. ఈ డౌట్‌ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్‌ స్టోరి. ప్రభాస్ లైనప్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ స్పిరిట్‌. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రభాస్‌ బల్క్ డేట్స్ కావాలని, ఆ సినిమా చేసేటప్పుడు డార్లింగ్ మరే మూవీ చేయకూడదని పట్టు బట్టారు. మొదట్లో డార్లింగ్ కూడా ఈ కండిషన్స్‌కు ఓకే చెప్పారన్న టాక్ వినిపించింది. స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే సమయానికి సీన్ మారిపోయింది. ఎక్స్‌క్లూజివ్‌గా ఒకే సినిమా మీద వర్క్ చేయటం డార్లింగ్ లైనప్‌తో సాధ్యం కాదని తేలిపోయింది. ప్రజెంట్ ఫౌజీ వర్క్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే కల్కి 2 షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలోనే ఈ మూవీ సెట్‌లోనూ అడుగుపెట్టబోతున్నారు ప్రభాస్‌. ఈ రెండు సినిమాలతో పాటు స్పిరిట్‌కు కూడా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. అంటే మూడు సినిమాల షూటింగ్ ప్యారలల్‌గా జరగతుందన మాట. గతంలో స్పిరిట్ కోసం సందీప్ పెట్టిన కండిషన్స్ ఏవీ ఇప్పుడు వర్కవుట్ కావటం లేదు. ఫైనల్‌గా అన్ని సినిమాల షూటింగ్స్‌ ప్రభాస్‌ స్టైల్‌లోనే జరుగుతున్నాయి. ఎవరు ఏ డిమాండ్స్ పెట్టినా డార్లింగ్ మాత్రం కన్సిడర్ చేయటం లేదు. గతంలో ఏ స్టైల్‌లో వర్క్ చేశారో.. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. దీంతో ఏ రేంజ్‌ డైరెక్టర్ అయినా… డార్లింగ్ లైన్‌లోకి రావాల్సిందే కానీ, డార్లింగ్ మాత్రం ఎవరి కండిషన్స్‌కు ఓకే చెప్పే పరిస్థితి లేదని తేలిపోయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు

ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా

Follow Us