Polimera 3: పొలిమేరలో ఆయన అడుగు.. దారి మారుతుందా..?

Edited By:

Updated on: Jul 30, 2026 | 4:05 PM

తెలుగులో విజయవంతమైన హారర్ ఫ్రాంచైజీ 'మా ఊరి పొలిమేర' ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో చేరడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. చేతబడులు, క్షుద్రపూజల నేపథ్యంలో సాగే ఈ కథలో హారర్‌తో పాటు యాక్షన్ అంశాలు కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్ వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ ఫ్రాంచైజీ పొలిమేర రూట్ మారుతుందా..? చేతబడులు, క్షుద్రపూజలు అంటూ ప్యూర్ హార్రర్ వైబ్స్ తీసుకొచ్చిన ఈ సినిమా మూడో భాగం ఎలా ఉండబోతుంది..? యాక్షన్ కింగ్ అర్జున్ ఎంట్రీతో పొలిమేర 3 దారి ఎటువైపు వెళ్తబోతుంది..? హార్రర్ సస్పెన్స్ జోన్ నుంచి యాక్షన్ వైపు రానుందా..? అసలెలా ఉండబోతుంది పొలిమేర 3..? తెలుగు ఇండస్ట్రీలో పొలిమేర ఫ్రాంచైజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా కరోనా టైమ్‌లో ఓటిటిలో వచ్చిన ఈ చిత్రానికి అక్కడ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాంతో పార్ట్ 2ను థియేటర్లలో విడుదల చేసి హిట్ కొట్టారు మేకర్స్. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. పార్ట్ 1తో పోలిస్తే పొలిమేర 2ను భారీగానే తెరకెక్కించారు.. రిలీజ్ కూడా అలాగే చేసారు. పైగా వంశీ నందిపాటి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాక బిజినెస్ రేంజ్ పెరిగింది. తాజాగా ఇందులో మూడో భాగం మొదలైంది. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘పొలిమేర 3’ సికింద్రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న బ్లాస్ట్ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో అర్జున్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర రప్ఫాడించింది. బ్లాస్ట్ తర్వాత అర్జున్ చేస్తున్న సినిమా కావడంతో పొలిమేర 3కి ఇది బాగానే హెల్ప్ కానుంది. అర్జున్ ఉన్నారు కాబట్టి తమిళంలోనూ ఈ ప్రాజెక్ట్‌కు మార్కెట్ రావడం ఖాయం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

Loading...
Unable to load recommendations.
Follow Us