Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. ఈసారి దబిడి దిబిడే..

Edited By:

Updated on: Mar 23, 2026 | 5:24 PM

రాజకీయాలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించినప్పటికీ, ఆయన అప్‌కమింగ్ మూవీ ప్రాజెక్ట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఓజీ 2 ఖాయం కాగా, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, దేవా కట్ట దర్శకత్వంలోనూ సినిమాలు ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా చిత్రాల మిక్స్‌డ్ టాక్ నేపథ్యంలో, అభిమానులు పవర్ స్టార్ నుండి మరో పెద్ద హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వార్తలు వారిని సంతోషపరుస్తున్నాయి.

ఉస్తాద్ భగత్‌ సింగ్ కూడా రిలీజ్‌ కావటంతో పవన్‌ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఆయన అప్‌ కమింగ్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఆన్‌లైన్‌లో ట్రెండ్‌ అవుతున్న వార్తల్లో నిజమెంత.. పవన్‌ సినిమాలు చేస్తారా..? చేస్తే ఏ కాంబినేషన్‌లో..? హరి హర వీరమల్లు నిరాశపరిచినా.. ఓజీ సక్సెస్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్‌ ఖుషీ చేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్‌ సింగ్‌కు మిక్స్‌డ్‌ టాక్ వినిపిస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్‌ నుంచి మరో బిగ్ హిట్ కావాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మరి పవన్ సినిమాలు చేస్తారా..? చేస్తే ఎవరితో అన్న విషయంలోనూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు పవన్‌. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తాజాగా మరిన్ని నేమ్స్ పవన్‌ లైనప్ విషయంలో ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఎక్స్‌ స్పేస్‌లో మాట్లాడిన హరీష్ శంకర్‌, పవర్‌ స్టార్‌తో మరో మూవీ ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో వైపు దేవా కట్ట దర్శకత్వంలోనూ పవన్‌ ఓ సినిమా చేసే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వీటిన్నింటికి మించి ఓజీ 2 ఉంటుందన్న విషయాన్ని పవన్‌ స్వయంగా కన్పార్మ్ చేశారు. ఇలా మల్టీపుల్‌ ప్రాజెక్ట్స్‌ ఊరిస్తుండటంతో పవన్‌ ఇప్పట్లో సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ లేదని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో పవన్‌ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సవాళ్లకు సై అంటున్న హీరోయిన్లు.. నిర్మాతలుగా ప్రూవ్ చేసుకుంటున్న ముద్దుగుమ్మలు

టాలీవుడ్‌ వైపు చూస్తున్న ధురంధర్‌ డైరెక్టర్‌.. లిస్ట్‌లో ఉన్న స్టార్స్‌ వీరే ??

Follow Us