పవర్ స్టార్ హరి హర వీరమల్లు.. హిట్టా..! ఫట్టా..! లేక ??
బ్రో తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయాడు పవన్ కళ్యాణ్. మళ్లీ ఆయన నుంచి వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. ఐదేళ్ల కింద మొదలైన ఈ సినిమా ఎన్నో కష్టనష్టాలు పడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి పవన్ చెప్పినట్టు నిజంగానే అదిరిపోయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. ఈ సినిమా స్టోరీ లైన్ బ్రీఫ్‌గా ఏంటంటే! వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్ ఒక మంచి మనసున్న, ధైర్యమున్న..గజ దొంగ.
రాబిన్ హుడ్ తరహాలో పెద్దవాళ్ళను కొట్టి పేదవాళ్లకు పెడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో వీరమల్లుకు ఒక దొర అలియాస్ సచిన్ ఖేడ్కర్ నుంచి పిలుపు వస్తుంది. అక్కడే పంచమి అలియాస్ నిధి అగర్వాల్ ను చూసి ఇష్టపడతాడు వీరమల్లు. తనను దొరల చెర నుంచి తప్పించమని .. పంచమి కోరడంతో సరేనంటాడు వీరమల్లు. అదే సమయంలో కుతుబ్ షాహీల నుంచి వీరమల్లుకు పిలుపు వస్తుంది. వెళ్లి మాట్లాడగా.. ఎర్రకోటలోని నెమలి సింహాసనం మీద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తెచ్చి.. తనకు అప్పగించాలని కుతుబ్ షాహీ పాలకుడు .. వీరమల్లును కోరతాడు. ఆ నెమలి సింహాసనం మీద నరరూప రాక్షసుడు అయిన ఔరంగజేబు అలియాస్ బాబి డియోల్ కూర్చొని ఉంటాడు. మతం మారకపోతే పన్ను కట్టాల్సిందే అని హిందువులను హింసిస్తుంటాడు. అలాంటి వాడి సింహాసనం మీద పొదిగిన కోహినూర్ వజ్రం కోసం తన దండుతో ఢిల్లీ బయలుదేరుతాడు వీరమల్లు. ఆ తర్వాత ఏమైంది.. ఆ వజ్రాన్ని చేరుకున్నాడా లేదా అనేది అసలు కథ.. ఈ రోజుల్లో పీరియాడిక్ సినిమాలు చాలానే వస్తున్నాయి. అయితే అలాంటి సినిమాలకు బోలెడంత టైం కూడా నటీనటులు ఇవ్వాల్సి వస్తోంది. హడావుడిగా తీస్తే.. అది అవుట్ పుట్ పై ప్రభావం భారీగా పడుతుంది. హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన మెయిన్ పొరపాటు ఇదే. 30 రోజులు తీయాల్సిన సీన్‌ని 3 రోజులలో తీయటం, 8 గంటల కాల్షీట్ ను 2 గంటలకు పరిమితం చేయటం వల్ల సినిమా విజువల్ క్వాలిటీ తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, పవన్ అనే హీరో క్రేజ్ ముందు చిన్న విషయాలుగా మారిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కట్టు తప్పిన కన్నకూతురు.. దారుణశిక్ష విధించిన తల్లిదండ్రులు
పొద్దున్నే ఆలయానికి వెళ్లి డోర్ తీసిన అర్చకుడికి షాక్.. ఏం జరిగిందంటే..?
అన్ని లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌గానే వారి ఆధార్ కార్డులు
నక్క తోక తొక్కడం అంటే ఇదే కాబోలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కూలీ
