సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా

Updated on: Feb 18, 2026 | 7:09 PM

తెలుగు సినీ పరిశ్రమలో సీక్వెల్స్ పట్ల దర్శకుల వైఖరి మారుతోంది. కథలకు ఒకే భాగంలో స్పష్టమైన ముగింపు ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి, నాని, యష్ వంటి ప్రముఖులు తమ ప్రాజెక్ట్‌లను సింగిల్ పార్ట్ లోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు, అనవసరమైన అంచనాలను, ఇబ్బందులను నివారించేందుకు.

సినిమాలకు సీక్వెల్స్ తప్పనిసరి కాదనే కొత్త ట్రెండ్ తెలుగు చిత్ర పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తోంది. కథను సాగదీయడం, లేదా కొనసాగింపుపై ఊరించడం కంటే, ఒకే భాగంలో పూర్తిస్థాయి ముగింపు ఇవ్వాలనేది ఇప్పుడు చాలా మంది దర్శకుల ఆలోచన. కథను పర్ఫెక్ట్ గా ముగిస్తే, తర్వాతి కథ కాస్త ఆలస్యమైనా ప్రేక్షకులు పట్టించుకోరని రాజమౌళి “బాహుబలి”తో నిరూపించారు. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్ “వారణాసి”ని ఒకే భాగంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆయన మార్గంలోనే “నాచురల్ స్టార్” నాని కూడా నడుస్తున్నారు. తన “పారడైజ్” చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నప్పటికీ, దానికి సీక్వెల్ ఉండదని టీమ్ స్పష్టం చేసింది. తారక్ నటించే “డ్రాగన్” విషయంలో నీల్ కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. యష్ కూడా “టాక్సిక్” విషయంలో స్పష్టతతో ఉన్నారు. “కేజీఎఫ్” కథ కొనసాగింపు సరిపోతుందని, కొత్త కథలకు మళ్లీ సీక్వెల్స్ అక్కర్లేదని భావిస్తూ, “టాక్సిక్”ను సింగిల్ పార్ట్ లోనే తెరకెక్కించాలని యష్ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, “కథ కంచికి మనం ఇంటికి” అనే పాత మాట మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

Intermittent Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంతా ఉత్తిదేనా ? సైన్స్ చెప్పిన చేదు నిజం ఇదే

సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు

Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??

Follow Us