టాలీవుడ్‌లో తడబడుతున్న మల్లూ బ్యూటీస్‌

Updated on: Oct 30, 2026 | 6:38 PM

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లుగా వెలిగిన మలయాళ భామలకు ఇప్పుడు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదనే చర్చ సాగుతోంది. అనుపమ పరమేశ్వరన్‌, కల్యాణి ప్రియదర్శన్‌, మమితా బైజు, మాళవిక మోహనన్‌ తెలుగులో బ్రేక్‌ కోసం ఎదురుచూస్తుండగా, అనస్వర రాజన్‌ మాత్రం వరుస ప్రాజెక్టులతో దృష్టిని ఆకర్షిస్తున్నారు. ‘ఇట్లు అర్జున్‌’ తర్వాత చిరంజీవి కాకా, ‘అంతా రాములోరు చూసుకుంటారు’ సినిమాల్లోనూ ఆమె కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో మలయాళ ముద్దుగుమ్మల హవా ఓ రేంజ్‌లో ఉండేది. సాయి పల్లవి, నిత్యా మీనన్, కీర్తి సురేష్ లాంటి భామలు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా సత్తా చాటారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మాలీవుడ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌కి కూడా తెలుగులో సరైన అవకాశాలు రావటం లేదు. ఒకవేళ ఛాన్సులు వచ్చినా.. స్టార్ లీగ్‌లోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో మల్లూ బ్యూటీస్‌కి తెలుగులో లక్ పెద్దగా కలిసిరావట్లేదు. అనుపమా పరమేశ్వరన్‌ చాలా కాలంగా తెలుగులో సినిమాలు చేస్తున్నా.. కార్తికేయ 2, టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్‌బస్టర్స్ ఖాతాలో వేసుకున్నా.. ఇప్పటికీ స్టార్ లీగ్‌లోకి మాత్రం రాలేకపోతోంది. అటు కల్యాణీ ప్రియదర్శన్‌ కూడా హలో, చిత్రలహరి లాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించినా.. ఆమెకు వరుస అవకాశాలు మాత్రం రాలేదు. ప్రేమలు సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిపోయిన మమితా బైజు పరిస్థితి కూడా అంతే. మలయాళం, తమిళంలో సూపర్ ఫామ్‌లో ఉన్నా.. టాలీవుడ్ నుంచి మాత్రం చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావట్లేదు. మరోవైపు ఎన్నో ఆశలతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్‌కు ఆ తొలి సినిమాయే పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో బ్రేక్ దక్కలేదు. ఇలా మలయాళ భామలంతా టాలీవుడ్‌లో సరైన ప్లేస్ కోసం ఇబ్బంది పడుతుంటే.. ప్రజెంట్ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ మాత్రం ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆడియన్స్‌ను ఊరిస్తున్నారు. రీసెంట్‌గా ఇట్లు అర్జున మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ చిరంజీవి కాకాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సంగీత్ శోభన్‌తో కలిసి అంతా రాములోరు చూసుకుంటారు అనే డిఫరెంట్ లవ్‌ స్టోరి కూడా చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Husharu 2: వేరే సినిమాల్లో నటించని పీపుల్‌ స్టార్.. హుషారు2లో నటించారు.. ఎందుకో తెలుసా..

Janhvi Kapoor: కన్నీళ్లతో.. మనసులోని ప్రేమను బయటపెట్టిన జాన్వీ

Bigg Boss Telugu: బిగ్ బాస్ లోగుట్టును.. బయటపెట్టిన గీతూ రాయల్

ఒక్కో ఇన్విటేషన్‌ కార్డ్‌కు.. మరీ అంత ఖర్చు పెట్టారా?

Ranabaali: టాక్ ఏదైనా తగ్గేదేలే.. బాక్సాఫీస్ వద్ద రణబాలి రికార్డ్..!

Loading...
Unable to load recommendations.
Follow Us