Kriti Sanon: ట్రోలర్స్‌కు కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్! ఇంతకీ ఏ విషయంలో
బాలీవుడ్ నటి కృతి సనన్ సోషల్ మీడియా ట్రోలింగ్, బాడీ షేమింగ్‌పై తీవ్రంగా స్పందించారు. కరీనా కపూర్ హోస్ట్ చేస్తున్న ‘వాట్ విమెన్ వాంట్’ కార్యక్రమంలో రక్షాబంధన్ జ్యువెలరీ యాడ్‌లో తన దుస్తులపై జరిగిన విమర్శలను ప్రస్తావించారు. మహిళల సంస్కృతిని వారు ధరించే బట్టలతో కొలవలేమని, అమ్మాయిలను బాడీ షేమింగ్ చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలకు కరీనా కపూర్ కూడా మద్దతు తెలిపినట్లు కథనం పేర్కొంటోంది.
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్.. సోషల్ మీడియా ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరోయిన్ల డ్రెస్సింగ్, బాడీ షేమింగ్‌పై జరుగుతున్న ఆన్‌లైన్ హరాస్‌మెంట్ మీద మండిపడ్డారు ఈ బ్యూటీ. మహిళల స్వేచ్ఛ గురించి కృతి చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా సోషల్ మీడియా కామెంట్స్ ను లైట్ తీసుకునే కృతి సనన్.. కరీనా కపూర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వాట్ విమెన్ వాంట్’ షోలో మాత్రం ట్రోలర్స్‌పై ఫైర్ అయ్యారు. రీసెంట్‌గా ఓ రక్షాబంధన్ జ్యువెలరీ యాడ్‌లో తాను వేసుకున్న డ్రెస్‌పై జరిగిన రాద్ధాంతం గురించి ఘాటుగా స్పందించారు. ఆ యాడ్‌లో తాను వేసుకున్న చోళీని ఏకంగా నేషనల్ ఇష్యూగా మార్చి డిబేట్లు పెట్టడం చూసి షాక్ అయ్యానన్నారు కృతి. సంస్కృతి, సంప్రదాయాల గురించి లెక్చర్లు ఇచ్చే వాళ్లే.. తన ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా పోస్టుల కింద బూతులతో కామెంట్లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతి అనేది మహిళ మనసులో ఉంటుంది కానీ, వేసుకునే బట్టల్లో కాదన్నారు కృతి. అమ్మాయిలను బాడీ షేమింగ్ చేసే హక్కు ఎవరిచ్చారని కృతి నిలదీశారు. కృతి తీసుకున్న ఈ బోల్డ్ స్టాండ్‌కు కరీనా కపూర్ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, సమాజంలో పాతుకుపోయిన ఈ ధోరణి మారాలంటూ కృతి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో నీటి కొరత.. ఎమర్జెన్సీ ప్రకటించిన వాటర్ బోర్డు
సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!
పండగ రద్దీకి చెక్.. దీపావళికి స్పెషల్ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్
పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే
చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్