Keerthy Suresh: గ్యాప్ ఇవ్వలేదు.. తీసుకున్నా అంటున్న స్టార్ హీరోయిన్
కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ గ్యాప్ గురించి వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. అవకాశాలు రాలేదనడం తప్పు, తానే బ్రేక్ తీసుకున్నానని స్పష్టం చేశారు. పెళ్లి అయిన రెండేళ్లకు తెలుగు, తమిళం, మలయాళం, హిందీలలో మొత్తం 5 కొత్త సినిమాలతో ఆమె తిరిగి జోరు పెంచుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనిల్ రావిపూడి వంటి వారితో ప్రాజెక్ట్‌లు చేయనున్నారు.
గ్యాప్ రాలేదు.. నేను ఇచ్చానంటున్నారు కీర్తి సురేష్. పెళ్లి తర్వాత ఈమెకు అవకాశాలు రావట్లేదని అనుకున్నారంతా. కానీ సీన్ చూస్తుంటే అలా లేదు.. ఆఫర్స్ వచ్చినా కూడా తానే గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లైన రెండేళ్లకు జోరు పెంచేసారు ఈ బ్యూటీ. ఇప్పటికే తెలుగులో 2.. తమిళంలో 2.. హిందీలో ఓ సినిమాతో రప్ఫాడిస్తున్నారు. ఇంతకీ కీర్తి ఇప్పుడెన్ని సినిమాలు చేస్తున్నారు..? బేబీ జాన్ తర్వాత తెలియకుండానే కీర్తి సురేష్ కెరీర్‌లో చిన్న బ్రేక్ అయితే వచ్చింది.. పెళ్లైంది కదా ఆ మాత్రం గ్యాప్ రావడం సహజమే అంటున్నారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త టైమ్ అయినా ఇవ్వాలిగా అంటూ కీర్తికే సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలు నిలబెడుతూ.. వరస ప్రాజెక్ట్స్‌కే ఓకే చెప్తున్నారు ఈ కేరళ కుట్టి. ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకున్నాక కాస్త గ్యాప్ తీసుకున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ఈ మధ్యే విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన సినిమాకు ఓకే చెప్పారు కీర్తి. దాంతో పాటు అనిల్ రావిపూడి, వెంకీ సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్ ఛాయిస్ అని తెలుస్తుంది.. అలాగే సుమంత్ నటిస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ కీర్తికి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అక్కడ కన్నివేడి అనే సినిమాతో పాటు మరో రెండు కథలు ఫైనల్ చేసారు. ఇక మలయాళంలో తొట్టం సినిమా చేస్తున్నారు. ఇక హిందీలోనూ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారు కీర్తి. మొత్తానికి పెళ్లి తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి.. అన్ని ఇండస్ట్రీల్లోనూ మళ్లీ రచ్చ చేస్తున్నారు కీర్తి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్‌గా ఇచ్చి.. సర్‌ప్రైజ్ చేసిన కంపెనీ
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం