Kantara Chapter 1 OTT: దిమ్మతిరిగే న్యూస్.. OTTలోకి కాంతార చాప్టర్ 1
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కాంతారా చాప్టర్ 1'. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డు వసూళ్లు సాధిస్తోంది. సినిమా రిలీజై మూడు వారాలు దాటిపోయినా కాంతార ప్రభంజనం ఆగడం లేదు. చాలా చోట్ల ముఖ్యంగా కర్ణాటకలో ఈ మూవీకి ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి.
కొత్త సినిమాలు రిలీజైనా కాంతార కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఈ సినిమా రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు కూడా నెలకొల్పింది. ఈ క్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. కాంతార ఛాప్టర్ 1 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని సమాచారం. ఇందుకోసం దర్శక నిర్మాతలకు రూ. 125 కోట్లు చెల్లించినట్లు సమచాఆరం. ఈ నేపథ్యంలో అన్నీ కుదిరితే అక్టోబర్ 30న లేదా నవంబర్ మొదటి వారంలో కాంతారా ఛాప్టర్ 1 సినిమా ఓటీటీలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన కాంతార ఛాప్టర్ 1 సినిమాలో రిషబ్ షెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. అలాగే తమిళ నటుడు జయరామ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమకు స్వరాలు అందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కింగ్ కోబ్రా తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా.. చూస్తే గుండె గల్లంతే
పశువులకోసం గడ్డి కోస్తున్న యువతి.. ఊహించని విధంగా
పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం
