సినిమా హీరోయిన్‌గా ‘గుప్పెడంత మనసు’ జగతి.. ఆంటీ టూ అందాల బ్యూటీ!

Updated on: May 01, 2025 | 4:16 PM

జ్యోతి రాయ్‌! గుప్పెడంత మనసు సీరయల్లో జగతి ఆంటీగా పాపులర్ అయిన ఈమె.. ఆ సీరియల్ తర్వాత ఒక్కసారిగా హాట్ అవతార్‌లోకి ట్రాన్స్‌ఫాం అయి అందరికీ షాకిచ్చింది. అందరూ తన గురించి మాట్లాడుకేనేలా చేసింది. అంతేకాదు అప్పటి నుంచే ఇన్‌స్టాలో అందాలు ఆరబోయడం షురూ చేసిన ఈమె.. సోషల్ మీడియాలో విహరించే టీన్స్‌కు ఏంజెల్ అయిపోయింది.

విపరీతమైన క్రేజ్‌ ను సంపాదించేసింది. ఇప్పుడేమో చడీ చప్పుడు కాకుండా.. ఓ సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన తన డెబ్యూ మూవీ వీడియో గ్లింప్స్‌తో ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. తాను హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన డెబ్యూ మూవీ కిల్లర్‌తోనే ఇప్పుడు తన ఫ్యాన్స్‌ అందరికీ షాకిస్తోంది జగతి అలియాస్ జ్యోతీరాయ్. వైమానిక శాస్త్రం కాన్సెప్ట్‌తో… లేడీ ఓరియెంటెడ్ సినిమాగా.. పూర్వజ్‌ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ టీజర్‌ యూట్యూబ్‌లో రిలీజ్‌ అయింది. ఇక ఈ టీజర్లో జ్యోతి రాయ్‌.. గ్లామరస్ గా కనిపించడమే కాదు.. ఫైటింగ్స్ అండ్ గన్‌ ఫైరింగ్‌లో సీన్స్‌లో కూడా ఇరగదీసినట్టు కనిపిస్తోంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్.. పూర్తిగా కోలుకుంటే.. పునర్జన్మ ఎత్తినట్లే అని, అప్పుడు ఆమెకు ఎదురు నిలవడం ఎవరి వల్లా కాదని గ్లింప్స్ లో రివీల్ చేసిన స్టోరీ లైన్‌ అందరి అటెక్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. అందులోనూ గ్లామరస్‌ కమ్‌.. సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి రాయ్ కనిపించడం ఈ మూవీ ప్లస్ అవుతుందనే కామెంట్ ఇప్పుడే వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు

మేకప్‌ రూమ్‌కి పిలిచి మరీ.. గోపీచంద్‌కు క్లాసు పీకిన చిరు..!

ఉగ్రదాడిపై హీరో పాజిటివ్ పోస్ట్‌.. దారుణంగా తిట్టిన ఇండియన్స్‌.. దెబ్బకు యూటర్న్‌

మా హీరోను అన్నావ్ సరే.. మరి నీకేం తెలుసు బోడి