నానా పటేకర్ మృతి.. ఎన్టీఆర్‌ ఎమోషనల్ పోస్ట్

Updated on: Oct 09, 2026 | 4:58 PM

ప్రముఖ నటుడు నానా పటేకర్‌ మరణంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ నిజాయితీ, తీవ్రత కనిపించేవని, తెరపై ఆయన నటన నిజజీవితంలా అనిపించేదని సోషల్‌ మీడియాలో నివాళులర్పించారు. భారతీయ సినిమాకు నానా పటేకర్‌ చేసిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నానా పటేకర్‌ 75 ఏళ్ల వయసులో అక్టోబర్‌ 8న మరణించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి.

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ మృతిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి నానా పటేకర్‌ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన నానా పటేకర్‌ మరణ వార్త విని తీవ్రంగా విచారిస్తున్నానంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ స్పష్టమైన నిజాయితీ, తీవ్రత కనిపించేవని.. ఆయన నటన ఎప్పుడూ నటనలా అనిపించేది కాదంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. తెరపై ఆవిష్కృతమవుతున్న జీవంలా నానా నటన ఉండేదంటూ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు, ఆయన అందించిన అద్భుతమైన నటన తరతరాల పాటు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. నానా పటేకర్‌ కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు జూనియర్ ఎన్టీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aggipetta Macha Game: అగ్గిపెట్టె మచ్చా మీద.. ఏకంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో గేమ్‌ ఉంది తెలుసా?

Bigg Boss Telugu 10: 15 లక్షల్లో.. మిథిలేష్‌కు మిగిలేది మరీ అంతేనా.. ఏదో అనుకున్నాడు పాపం!

OTTలో మెంటలెక్కించే క్రైమ్‌ థ్రిల్లర్ ఈ సినిమా ఎలా ఉందంటే…?

Loading...
Unable to load recommendations.
Follow Us