Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు
తలపతి విజయ్ కేవలం ఒక నటుడు కాదు, తమిళనాట ఒక సంచలనం. బాలనటుడి నుండి పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానం, సామాజిక సందేశాలతో కూడిన సినిమాలతో మాస్ హీరోగా మారిన తీరు అద్భుతం. తాజాగా 'తమిళగ వెట్రి కళగం' పార్టీ స్థాపించి రాజకీయ ప్రవేశం చేసిన విజయ్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, విడాకుల వార్తలు ఆయనకు కొత్త చర్చను తీసుకొచ్చాయి.
విజయ్ జోసెఫ్. ఈ పేరు చెబితే తమిళనాడు షేక్ అయిపోతుంది. ఆయనకున్న క్రేజ్‌ను దక్షిణాదిలో మరే హీరోతో పోల్చలేం. ఎందుకంటే ఆయనది ఓ కులానికో, మతానికో, ప్రాంతానికో పరిమితం అయిన స్టార్‌డమ్ కాదు. అన్ని వర్గాలను, అన్ని వయసుల వారీని విజయ్ ఆకట్టుకున్నారు. తన సినిమాలతో.. తన నటనతో.. తన డ్యాన్సులు, ఫైట్లతో సౌతిండియా టాప్ స్టార్‌గా ఎదిగారు విజయ్. ఒక్క తమిళ స్టేట్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా పాపులర్ అయ్యారు. పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే.. నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. బాలీవుడ్ టాప్ స్టార్లు కూడా విజయ్ తమ సినిమాలో క్యామియో చేస్తే చాలనే రేంజ్‌కు ఎదిగారు. జూన్ 22, 1974లో చెన్నైలో విజయ్ జన్మించారు. ఆయన తండ్రి S.A. చంద్రశేఖర్, సినిమా డైరెక్టర్. తల్లి శోభా చంద్రశేఖర్, గాయని. తండ్రి క్రిస్టియన్, తల్లి హిందూ..! అయితే విజయ్ మాత్రం కుల మతాలకు అతీతంగా పెరిగారు. ఆయన స్కూల్లో చదువుకునే సమయంలో తండ్రి చంద్రశేఖర్.. క్యాస్ట్ కాలంలో తమిళ్ అని రాయించారు. తనది ఫలానా కులం అని ఇప్పటివరకు విజయ్ చెప్పుకోలేదు. పేరులో జోసెఫ్ ఉన్నా.. తనది క్రైస్తవ మతం అని గాని.. ఫలానా మతానికి తన మద్దతు అని గాని ప్రకటించలేదు. 1999లో సంగీతతో వివాహం జరిగింది. విజయ్, సంగీత దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ అప్పట్లోనే మాస్ సినిమాల దర్శకుడిగా పేరుపొందారు. దీంతో విజయ్ సినీ ప్రయాణం కూడా తన తండ్రి చేతులమీదుగానే మొదలైంది. 1984లో ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘వెట్రి’ చిత్రంతో సినిమాల్లోకి అడుగు పెట్టాడు విజయ్. బాలనటుడిగా ‘కుటుంబం’, నాన్ సిగప్పు మణితన్, ‘వసంత రాగం’, ‘సట్టం ఒరు విలయాట్టు’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. చిన్ననాటి నుంచే నటనపై ఉన్న ఆసక్తి, తండ్రి ప్రోత్సాహం విజయ్‌ను.. వెండితెరపై చిన్న నాటే విజయవంతంగా నిలబెట్టాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. తండ్రి సినీ దర్శకుడే అయినప్పటికీ విజయ్‌కు మాత్రం తొలి చిత్ర అవకాశం అంత సులభంగా రాలేదు. తన బయోడేటాతో స్టూడియోల చుట్టూ తిరిగారు. తండ్రి కూడా కొడుక్కి తెలియకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాడు పేరున్న దర్శకులందరికీ కుమారుడి ఫొటో చూపించి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. చివరకు సగం పెట్టుబడి పెడతామన్నా విజయ్‌ను హీరో చేసేందుకు ఏ నిర్మాతా ముందుకురాలేదు. చివరికి చంద్రశేఖర్ రూ.60 లక్షలు అప్పుతెచ్చి కొడుకు హీరోగా తానే ‘నాళయ తీర్పు’ చిత్రాన్ని తీశారు. 1992లో వచ్చిన ఈ సినిమాతో విజయ్ హీరోగా పరిచయమయ్యారు కానీ.. విజయం అందుకోలేకపోయాడు. అంతేకాదు ఆరంభంలో ఆయనకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సినిమా విడుదలైనప్పుడు ఒక ప్రముఖ పత్రిక “ఈ ముఖం కూడా హీరోనా?” అని చాలా దారుణంగా విమర్శించింది. కానీ విజయ్ వెనకడుగు వేయలేదు.హీరోగా నిలదొక్కుకోవడానికి విజయ్ చాలా కష్టపడ్డారు.ఈ క్రమంలోనే మొదటి కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. నటుడిగా తన రూపం, నటనపై విమర్శలు ఎదురవుతున్నా, వాటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో శ్రమించారు. తండ్రి అండతో పాటు, అప్పటి స్టార్ హీరో విజయకాంత్ తో.. 1993లో ‘సెందూర్పాండి’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా నే విజయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పూవే ఉనక్కాగ’ – విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం. 1996లో వచ్చిన ఈ సినిమా విజయ్‌కు మంచి టర్నింగ్ గా మారింది. విక్రమన్ దర్శకత్వంలో వచ్చిన ‘పూవే ఉనక్కాగ’ సినిమాతో ఆయనకు మొదటి భారీ విజయం దక్కింది. ఈ సినిమాతో ఆయన ‘లవర్ బాయ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత వచ్చిన ‘కాదలుక్కు మరియాదై’, ‘తుల్లాద మనముమ్ తుళ్లుమ్’, ‘ఖుషి’ వంటి చిత్రాలు విజయ్‌ను క్లాస్ ఆడియన్స్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేశాయి. 2000వ దశకం ఆరంభంలో విజయ్ తన ఇమేజ్‌ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. లవ్ స్టోరీల నుండి మాస్ యాక్షన్ వైపు మళ్లారు. ఈ క్రమంలోనే 2003 లో తిరుమలై సినిమా చేశాడు. ఆ సినిమా విజయ్ మాస్ ఇమేజ్‌కు పునాది వేసింది. ఈ సినిమాకు రమణ డైరెక్టర్. ఇదే సినిమా తెలుగులో గౌరీ పేరుతో రిమేక్ అయింది. గౌరీ సినిమాలో సుమంత్ హీరోగా నటించాడు. తిరుమలై తర్వాత.. విజయ్ చేసిన మరో చిత్రం గిల్లి.. తమిళనాట ప్రభంజనం సృష్టించింది. మహేష్ ఒక్కడుకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా విజయ్‌కు పీక్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అంతేకాదు ఈ విజయంతో విజయ్ ఒక కమర్షియల్ కింగ్‌గా అవతరించారు.గిల్లి సినిమాతో.. తమిళ నాట నమోదైన అన్ని కలెక్షన్స్ రికార్డులను విజయ్ చెరిపేశాడు. అప్పుడే తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో మహేష్ హీరోగా పోకిరి రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు నాట ప్రభంజనం సృష్టించింది. ఇదే సినిమా ప్రభుదేవా డైరెక్షన్లో విజయ్ హీరోగా రిమేక్ అయింది. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్‌ను యూత్‌కు చేరవ చేసింది. విజయ్ కంటూ సపరేట్ స్టైల్ ను క్రియేట్ అయ్యేలా చేసింది. అంతే కాదు ఈ సినిమాలో విజయ్ వేసిని స్టెప్స్ అప్పట్లో అందర్నీ ఉర్రూతలూగించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన తిరుపాచి, శివకాశి చిత్రాలతో విజయ్ బియాండ్-స్టార్‌డమ్ ఎదిగారు. అగ్రకథానాయకుడిని మించి పోయాడనే చెప్పాలి. గిల్లి.. పోకిరి సినిమాతో తెచ్చుకున్న స్టార్ డమ్ కారణంగా… విజయ్ సినిమాలపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి తమిళనాట. అయితే ఈ అంచనాలను అందుకోవండంలో.. విజయ్ తడబడ్డాడు. పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత 2007 నుంచి 2011 వరకు వరుస పరాజయాలను చవిచూశాడు. సుర, కురువి సినిమాలు దారుణంగా పరాజయం అవ్వడంతో .. బాక్సాఫీస్ దగ్గర రిమైనింగ్ స్టార్స్‌తో పోల్చితే వెనకపడ్డాడు విజయ్. 2011లో వచ్చిన ‘కావలన్’, ‘వేలాయుధం’ సినిమాలతో తన స్థానాన్ని మళ్ళీ పదిలం చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో, ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘తుపాకీ’ సినిమా.. ఆయన కెరీర్‌ను మళ్ళీ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లింది. ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లను సాధించిన విజయ్ మొదటి సినిమాగా నిలిచింది.అంతేకాదు ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో.. విజయ్ తన ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉండాలనేది నిర్ణయించుకున్నారు. ఎంటర్ టైన్మెంట్ సినిమాలకు చిన్న మెసేజ్ టచ్ ఇచ్చి సినిమాలు చేసేందుకు డిసైడ్ అయ్యాడు. గత ఎనిమిదేళ్లుగా విజయ్ సినిమాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సామాజిక అంశాలను కూడా స్పృశించాయి. కత్తి, 2017లో వచ్చిన మెర్సల్, 2018లో వచ్చిన సర్కార్ సినిమాలు రాజకీయ వివాదాలను రేకెత్తించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించాయి. అంతేకాదు కత్తి, మెర్సల్, సర్కార్ చిత్రాల్లో విజయ్ సామాజిక సమస్యలపై గొంతు ఎత్తారు. జీఎస్టీ, కార్పొరేట్ అన్యాయంపై ఆయన చెప్పిన డైలాగులు అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. తమిళ తంబీల్లో విజయ్ పేరు మార్మోగిపోయింది. విజయ్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఆయన ఫ్యాన్స్ లో అప్పుడే మొదలైంది. అంతేకాదు ఫ్యూచర్‌లో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే విషయం ఆయన నియర్ అండ్ డియర్స్ కు ఈ సినిమాలతో తెలిసిపోయింది. ఆ తర్వాత విజయ్ లోకేష్ కనగారాజ్ డైరక్షన్లో చేసిన మాస్టర్ సినిమా.. విపరీతమైన అటెక్షన్‌ను గ్రాబ్ చేసుకుంది. కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో ఈ సినిమాలు కీలక పాత్ర పోషించాయి.ఈ సినిమా తర్వాత వచ్చిన వారసుడు, బీస్ట్, లియో వంటి సినిమాలు కూడా 300 నుండి 600 కోట్ల వరకు వసూలు చేసి ఆయనను ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలబెట్టాయి. అంతేకాదు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు కలెక్షన్స్ కుమ్మరిస్తాయనే విషయమూ మేకర్స్ కి తెలిసిపోయింది. ఇక విజయ్ 2024 సినిమాలో GOAT ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా చేశాడు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ సత్తా ఏంటో అందరికీ చూపించాడు. అయితే ఈ సినిమాతో విజయ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఈ సినిమా సీన్లలోని విజయ్ వాడిన కారు మీద 2026 cm అని ఉంటుంది. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బరిలోకి దిగుతాడని అప్పటి నుంచే వార్తలు మొదలయ్యాయి. తన అభిమానుల కోసం విజయ్ మరో సినిమా చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అదే జననాయగన్ మూవీ. దలపతి 69వ మూవీ.ఈ సినిమాకు H వినోద్ దర్శకుడు. ఇది తన చివరి సినిమా అని విజయే ప్రకటించుకోవడంతో.. ఈసినిమాపై తమిళ తంబీల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డ్ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. సినీ కెరీర్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడే విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2024లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించాడు. 2026 తమిళనాగు శాసన సభ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. విజయ్ భార్య విడాకులు ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇంటి నుంచి బయటికి వచ్చి కోర్టు మెట్లెక్కింది. తన భర్త నుంచి తనకు విడాకులు కావాలంటూ.. నేరుగా కోర్టుకు విన్నవించింది. అయితే ఈ కారణంగా విజయ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో పాటే రాజకీయనాయకులు కూడా.. ఈ విడాకుల మ్యాటర్‌ను వాడుకుని విజయ్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. తూటాల్లాంటి మాటలతో విజయ్‌ను ఇరుకున పెట్టారు. విజయ్ విడాకుల మ్యాటర్‌తో పాటే.. విజయ్ త్రిష మధ్య బంధం గురించి రాజకీయ నేతలు ప్రచారం చేయడం కూడా తమిళనాట సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే త్రిష ఆ నాయకులపై సీరియస్ కాగా.. విజయ్ మాత్రం వినూత్నంగా.. త్రిషతోనే ఓ పెళ్లికి వెళ్లి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. పర్సనల్ లైఫ్‌లోనే కాదు.. తన సినిమా రిలీజ్ విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు విజయ్ తలపతి. విజయ్ నటించిన చివరి సినిమా జననాయగన్ సినిమా విడుదల విషయంలోనూ DMK నేతలు రాజకీయం చేశారనే కామెంట్ ఉంది. సెన్సార్ బోర్డ్ ముందు జననాయగన్ సినిమా ఆగిపోవడం.. సెన్సార్ బోర్డ్ తీరుపై జననాయగన్ మూవీ టీం కోర్టు మెట్లెక్కడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే జననాయగన్ మూవీ నెట్టింట లీకైంది. దీనిలో కుట్రకోణం ఉందని విజయ్ ఫ్యాన్స్ బలంగా నమ్మడంతో.. ఆయనకు సపోర్ట్‌గా చాలా మంది మాట్లాడారు. అయితే వెనక్కి తగ్గని కొంత మంది నేతలు జననాగయన్ సినిమాను రిలీజ్ కాకముందే లోకల్ ఛానెల్లో ప్రసారం చేశారు. ఇలా విజయ్‌ను నేరుగా కాకుండా.. ఇండైరెక్ట్‌గా దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. ఇలా విజయ్ చుట్టూ వివాదాలు, కేసులు నడిచినా.. ఆయన్ను పర్సనల్‌గా ప్రొఫెషనల్‌గా దెబ్బకొట్టే ప్రయత్నం చేసినా… తలపతి మాత్రం వెనకంజ వేయలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రచారాన్ని నిర్వహించారు. విజిల్స్ వేస్తూ.. సైకిల్ తొక్కుతూ.. పంచ్ డైలాగ్స్ పేలుస్తూ అటు ఫ్యాన్స్‌ను, ఇటు ఓటర్లను ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా తమిళ ఓటర్ల తీర్పుతో.. తమిళగడ్డపై 49 ఏళ్ల తర్వాత ఓ కొత్త పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ వచ్చింది. విజయ్ ప్రయాణం ఒకటే నేర్పుతుంది.. “ఎన్ని విమర్శలు ఎదురైనా, నీ లక్ష్యంపై గురి ఉంటే.. ఒక రోజు నువ్వే చరిత్ర సృష్టిస్తావు.” బాలనటుడిగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతూ, తన నృత్యం, స్టైల్, మేనరిజమ్స్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ప్రయాణం ఒక అద్భుతం. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, తనదైన ముద్రను వేసిన విజయ్ ఇప్పుడు రాజకీయ తెరపై ఎలాంటి విజయం సాధిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వెండితెరపై దళపతిగా మెరిసిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో ‘జననాయగన్’గా ప్రజల సమస్యలను తీర్చే బాధ్యతను ఎలా నిర్వర్తిస్తారో అని ఈగర్‌గా చూస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: సినిమా షూటింగ్ కోసం 150ట్యాంకర్ల డ్రింకింగ్ వాటరా..? జక్కన్నకు వాటర్ బోర్డ్ ఝలక్
Jana Nayagan: జననాయగన్ సినిమా పేరు మారుతుందా ??
Fauzi: ప్రభాస్ ఫౌజీ సినిమా టీంకు ప్రమాదం.. షూటింగ్‌కు బ్రేక్!
TVK Vijay: అప్పుడు NTR, ఇప్పుడు విజయ్! బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది..
