Janhvi Kapoor: దీపికాకు జాన్వీ సాలిడ్ కౌంటర్.. టాలీవుడ్ గురించి వాగితే ఇట్లే ఉంటది!
‘పెద్ది’ ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన జాన్వీ కపూర్ టాలీవుడ్ వర్కింగ్ కల్చర్‌ను ప్రశంసించింది. తెలుగులో చేసిన ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాల షూటింగ్‌లలో రోజుకు 9 గంటలకు మించి పని చేయలేదని తెలిపింది. లంచ్ బ్రేక్‌లకు, పని వేళలకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఇస్తారని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు గతంలో టాలీవుడ్‌పై దీపిక చేసిన వ్యాఖ్యలతో పోలుస్తున్నారు.
పెద్ది మ్యానియాతో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అవుతున్న జాన్వీ కపూర్.. ఇండైరెక్ట్‌గా దీపికాకు సాలిడ్ కౌంటర్ ఇచ్చింది. దాంతో పాటే టాలీవుడ్‌లో పని వేళల గురించి బాలీవుడ్ జనాల్లో ఉన్న అపోహలను పటాపంచలు చేసింది. టాలీవుడ్‌లో తాను 9 గంటలను మించి ఇంత వరకు ఎప్పుడూ పని చేయలేదని చెప్పుకొచ్చింది. ఎట్ ప్రజెంట్ పెద్ది ప్రమోషన్లో ఉన్న ఈ బ్యూటీ… ఓ ఇంటర్వ్యూలో భాగంగా… టాలీవుడ్‌లోని వర్కింగ్ కల్చర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్‌లో పని గంటలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని, ఇక్కడి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె ప్రశంసించింది. ముఖ్యంగా లంచ్ బ్రేక్ సమయంలో ప్రతి ఒక్కరూ చక్కగా విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటారని జాన్వి వెల్లడించింది. అంతేకాదు తెలుగులో తాను చేసిన ‘దేవర’, ‘పెద్ది’ చిత్రాల షూటింగ్స్ సమయంలో రోజుకు 9 గంటలకు మించి ఎప్పుడూ పని చేయలేదని జాన్వీ చెప్పుకొచ్చింది. దీంతో ఈ మాటలను హైలెట్ చేస్తున్న కొంత మంది నెటిజన్లు.. గతంలో టాలీవుడ్ వర్కింగ్ కల్చర్ పై దీపిక చేసిన కామెంట్స్ తో లింక్ చేస్తున్నారు. దీపిక మాటల్లో నిజం లేదని.. కల్కి 2, స్పిరిట్ సినిమా నుంచి పని గంటలు సాకుతో ఆమె తప్పుకోవడం ఆమె కెరీకే పెద్ద నష్టం అంటూ గుర్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Satyadev: ‘రాజకీయాల గురించి మాట్లాడితే సినిమాకే పెద్ద నష్టం! నోరు మూసుకోవడం బెటర్!
24 గంటల్లో 47,460 మొక్కలు!.. ప్రకృతి కోసం గిన్నిస్ రికార్డు సృష్టించిన పర్యావరణ యోధుడు
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!
