Janhvi Kapoor: ఆ నీచులు చేసింది లైగిక వేధింపులకు తక్కువేం కాదు
‘దేవర’లోని ‘చుట్టమల్లే’ పాటను ఏఐతో మార్ఫింగ్ చేసి అభ్యంతరకరంగా చిత్రీకరించిన ఘటనపై నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. మహిళలను వారి అనుమతి లేకుండా కల్పిత కంటెంట్‌లో చూపించడం అవమానకరమని పేర్కొన్నారు. దుస్తులు, కెమెరా యాంగిల్స్ లేదా ఏ ఇతర కారణం మహిళ హద్దులను ఉల్లంఘించడానికి అనుమతి కాదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మాట్లాడిన ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూకు జాన్వీ ధన్యవాదాలు తెలిపారు.
దేవర చిత్రంలోని చుట్టమల్లే పాటను మార్ఫింగ్ చేయడంపై యావత్ సినీలోకం మండిపడింది. ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడంపై సినీ నటులు ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ సహా పలువురు నటీనటులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత నీచమైన చర్య అని.. ఇలాంటి వాటికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా ఇష్యూ పై జాన్వీ కపూర్ తీవ్రంగా రియాక్టయ్యారు. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీస్ లో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఏఐ సాంకేతికతో మహిళలను వస్తువులుగా చిత్రీకరించడానికి, వారి అనుమతి లేకుండా కల్పిత కంటెంట్ ను ప్రచారం చేయడం అనేది అత్యంత అవమానకర చర్య అన్నారు జాన్వీ. ఇలాంటి పనులు చేయడం బాధాకరం. ఇది లైంగిక దాడికి ఏమాత్రం తీసిపోని పని. తానున్న చిత్రపరిశ్రమలో ప్రతి మహిళా ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితిని ఏదోరకంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇలాంటి దాడులకు గురవుతున్నారు. ప్రతి మహిళకు ఆమె శరీరం పట్ల గౌరవం ఇవ్వడం అనేది మానవత్వపు విలువల్లో అత్యంత ప్రాథమికమైనదంటూ జాన్వీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఒక మహిళ వద్దు అని చెబితే ఆ వద్దు అనేదాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గౌరవించాలని.. ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించినా.. ఆమె హద్దులను గౌరవించడం అనేది చాలా ముఖ్యమంటూ జాన్వీ తన పోస్టులో రాసుకొచ్చారు.ఆమె మినీస్కర్ట్ ధరించినంత మాత్రానా ఇష్టానుసారంగా కెమెరా పెట్టడానికి.. అభ్యంతరకరమైన కోణాల్లో చిత్రీకరించడానికి లేదా ఆమె శరీరాన్ని చిత్రీకరించడానికి అనుమతి ఇచ్చినట్లు కాదన్నారు. ఒక మహిళ దేనితో సౌకర్యంగా ఉంటుంది.. ఎలాంటి హద్దులు గీసుకుంటుంది.. తన శరీరంతో ఏం చేయాలనుకుంటుంది అనేది పూర్తిగా ఆమె సొంత నిర్ణయమని… జాన్వీ అభిప్రాయపడ్డారు. ఒక మహిళ ఎదుటివారి చూపులు, వారి తీర్పుల నుంచి తన భద్రత కోసం నిరంతరం పోరాటం చేయాల్సిందేనాఅంటూ జాన్వీ ప్రశ్నించారు. ఒక మహిళ హద్దులు, నిర్ణయాలు అనేది ఇప్పటికీ ఇతరుల అధీనంలో ఉన్నాయనేది చాలా బాధకరమన్నారు. ప్రతిరోజూ మహిళల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న వాస్తవమైన, భౌతిక భయాలు ఇఫ్పుడు డిజిటల్ ప్రపంచంలోకి విస్తరించాయి. మహిళల భద్రత, హద్దుల గురించి ప్రజలు ఆలోచించే విధానంలో మార్పు రావాలంటూ జాన్వీ అభిప్రాయ పడ్డారు. మీ కూతురిని రక్షించుకోండని చెప్పడం మాత్రమే కాదు.. అసలు ఇతరుల హద్దులను ఉల్లంఘించే హక్కు తమకు ఉందని అనుకునే కొందరి ఆలోచన విధానాన్ని కూడా మనం తొలగించాలన్నారు జాన్వీ కపూర్. ఆ మార్పులో కొంతభాగం ఆధర్శప్రాయమైన పురుషుల నుంచి వస్తుందన్నారు. ఏది సరైనదో, ఏది తప్పో స్పష్టంగా చెప్పగల నైతిక దిక్సూచి అనే చెప్పడం ధైర్యం ఉన్న పురుషుల నుంచి వస్తుంది. ఆ వీడియోకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎన్టీఆర్ సర్ కు ధన్యవాదాలు. లక్షలమంది అభిమానించే వ్యక్తి.. తనకు నేరుగా సంబంధం లేని విషయం గురించి మాట్లాడినప్పుడు ప్రతి మహిళకు ధైర్యం వస్తుంది. అలాగే చిరంజీవి , విజయ్, ఖుష్బూ మేడమ్ లకు ధన్యవాదాలు. . ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, ఏ రూపంలోనైనా వేధింపులకు పాల్పడే వారిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తాయని తాను ఆశిస్తున్నానని.. ఒక మహిళను కేవలం ఒక మనిషిగా చూడాలని, గౌరవించాలని కోరడం నిజంగా అంత పెద్ద విషయమా? ” అంటూ జాన్వీ కపూర్ సుధీర్ఘ పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Srikanth Odela: సుకుమార్ ఇంటి చుట్టూ మూడేళ్లు పిచ్చోడిలా తిరిగా..
పవన్‌తో సింగీతం ‘జీసెస్’ సినిమా చేద్దామనుకున్నారట.. ఆ సినిమా ఎందుకు ఆగిపోయిదంటే
