సాయిపల్లవి, విజయ్ సేతుపతి జోడీగా మణిరత్నం కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ‘ఇంజి వెల్లమ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం 2027 జనవరి 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇద్దరు చిన్నారులతో ఉన్న సాయిపల్లవి, విజయ్ సేతుపతి పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.
ఒకప్పుడు మణిరత్నం సినిమాలు అంటే అందరూ పడి చచ్చేవారు. క్లాసిక్స్ అంటూ కొనియాడేవారు. ఇంటెన్స్టేకింగ్లో.. మణిని కొట్టేవారు ఇక రారంటూ చెప్పేవారు. కానీ ఇప్పుడా దర్శకుడే సక్సెస్ కోసం పరితపిస్తున్నారు. రీసెంట్ డేస్లో వరుస ఫెయిల్యూర్స్తో హాట్ టాపిక్ అవుతున్నారు మణిరత్నం. అలాంటి ఈయన లేటెస్ట్ గా తన స్టైల్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో మన ముందు వస్తున్నారు. ఆ సినిమా పేరే ఇంజి వెల్లమ్. అంటే తెలుగులో అల్లం బెల్లం అని అర్థం. సాయిపల్లవి – విజయ్ సేతుపతి ఫస్ట్ జోడీగా నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో నైనా మణిరత్నం హిట్టు కొట్లాలని ఆయన ఫ్యాన్స్ అయితే గట్టిగా కోరకుంటున్నారు. ఇక ఇంజి వెల్లం సినిమాపై అనౌన్స్ మెంట్ నుంచే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కలకత్తాలో జరిగింది. ఆ షూటింగ్కు సంబంధించిన విజులవల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేశాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఒక అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ మూవీ 2027 జనవరి 29 వరల్డ్ వైడ్ రిలీజ్ కానుందని మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ బయటికి వచ్చింది. రిలీజ్ డేట్ తో పాటే.. విజయ్ సేతుపతి, సాయి పల్లవితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్న కొత్త పోస్టర్ను కూడా ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీ మాద్రాస్ కంపెనీ తమ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండితుడు లేకుండా ‘ఆత్మ గౌరవ’ పద్దతిలో పెళ్లి.. ఈ పెళ్లి ఎలా చేస్తారంటే..
షిరిడీ సాయి సన్నిధిలో రామ్ చరణ్.. వీడియో వైరల్
Ramayana: 8 రోజుల్లో వెయ్యి కోట్లు.. కొత్త రికార్డ్ సెట్ చేసిన ‘రామాయణ’
నాగుల చవితి పర్వదినాన ఆలయంలో అద్భుతం..
సెహ్వాగ్ కొడుక్కి.. కోహ్లీ సలహా ఇదే.. వైరల్ అవుతున్న ఆర్యవీర్ పాత ఇంటర్వ్యూ
