హనీరోజ్‌ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !

Updated on: Mar 15, 2025 | 11:43 AM

హనీరోజ్‌! మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్ బ్యూటీ గా నామ్ కమాయించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూర్‌ తనను వేదిస్తున్నాడటంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కి ఒక్క సారిగా సెన్సేషన్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే తన వైఖరిపై కొంత మంది సెలబ్రిటీలు మద్దతుగా మాట్లాడగా.. మరికొంత మంది ఈమెనే విమర్శించారు.

ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరో లేడీ నటి ఫరా శిబిల.. హనీ రోజ్‌ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. హనీరోజ్‌ అమాయకురాలేం కాదంటూ చెప్పారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. హనీ రోజ్ గురించి మాట్లాడారు. హనీరోజ్‌ అమాయకురాలైతే కాదు.. తను తెలివైనదని… తనేం చేస్తుందో తనకు బాగా తెలుసన్నారు. డబ్బు సంపాదించడం తప్పు కాదు.. కానీ ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతోమందికి ఆమె ఒక చెత్త ఉదాహరణగా నిలుస్తోండడమే తప్పన్నారు. సినిమాలు లేకపోతే శరీరాన్ని ఎగ్జిబిషన్‌గా పెట్టి డబ్బు సంపాదించుకోవాలనేది హనీరోజ్‌ నేర్పిస్తుందంటూ నటి ఫరా షాకింగ్ కామెంట్స్ చేశారు. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతిభను నమ్ముకోవాలి తప్ప శరీరాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హనీరోజ్ రియాక్షన్ ఎలా ఉండనుందో అంటూ.. అందర్నీ ఆలోచించేలా చేస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SSMB29 నుంచి మరో సాలిడ్ అప్‌డేట్‌.. సంతోషం లో ఫ్యాన్స్

కొడుకును పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న తల్లికి మూగజీవి ఓదార్పు

పొట్లకాయా.. అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నటికి చెక్ పెడుతుంది అంతే..