యూనివర్స్ లోకి వెళ్తే హిట్ పక్కా.. ఇదే ఇప్పటి ట్రెండ్ మామా

Updated on: Feb 07, 2026 | 4:10 PM

సింగిల్ కథల నుండి సీక్వెల్స్, ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్‌ల వైపు భారతీయ సినిమా అడుగులు వేస్తోంది. దర్శకులు ఒకే కథతో ఆగకుండా, పలు చిత్రాలకు విస్తరించేలా యూనివర్స్‌లను సృష్టిస్తున్నారు. సుజిత్ యూనివర్స్ నుండి వచ్చిన OG, సాహోకు ప్రీక్వెల్‌గా నిలుస్తూ, ప్రభాస్-పవన్ మల్టీస్టారర్ అవకాశాలకు దారి తీస్తోంది.

సింగిల్ కథలతో సినిమాలు తీయడం కష్టంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సీక్వెల్స్‌కు మించిన సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు దర్శకులు కేవలం సీక్వెల్స్‌తో ఆగకుండా, భారీ సినిమాటిక్ యూనివర్స్‌లను క్రియేట్ చేస్తున్నారు. ఒక హీరో ప్రపంచంలోకి మరో హీరోని పరిచయం చేస్తూ, పలు చిత్రాలను అనుసంధానిస్తున్నారు. ఇండియన్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా యూనివర్స్‌లు గణనీయంగా పెరిగాయి. మన దర్శకులు ఒక్క స్టోరీకే పరిమితం కాకుండా, మూడు నుంచి నాలుగు సినిమాలకు సరిపోయేలా పెద్ద ప్రపంచాలను నిర్మిస్తున్నారు. ఇటీవల సుజిత్ యూనివర్స్, లోకేష్ యూనివర్స్, ప్రశాంత్ వర్మ యూనివర్స్, ప్రశాంత్ నీల్ యూనివర్స్ వంటివి వార్తల్లో నిలుస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పల్లె బాట పట్టిన కథలు.. కోట్లు దాటుతున్న కలెక్షన్లు

Nani: వాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాని.. ఇలాగైతే కష్టమే బాస్

సీనియర్స్ ట్రెండు.. తీస్తున్నారు బాక్సాఫీస్ బెండు

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అబ్బా అద్భుతంగా ఉంది

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. అర్ధరాత్రి డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..